RJ Shekhar Basha: ప్రముఖ ఆర్జేగా పేరు సొంతం చేసుకున్న శేఖర్ బాషా (Shekhar Basha) గురించి ప్రత్యేకంగా పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పుడైతే హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya) కేస్ తెరపైకి వచ్చిందో.. అప్పటినుంచి ఈయన మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి కేసులో జోక్యం చేసుకున్న ఆర్జే శేఖర్ బాషా అటు రాజ్ తరుణ్ కి అండగా ఇటు లావణ్య పై లైవ్ డిబేట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈమెపై దాడి చేయించారని లావణ్య ఆర్జే శేఖర్ బాషాపై కేసు కూడా నమోదు చేసింది. అంతేకాదు తనను విచక్షణారహితంగా కొట్టాడు అని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా పోలీసులకు అప్పగించింది లావణ్య. ఇలా ఈ కేసులో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు శేఖర్ బాషా.
భార్యాబాధితులకు అండగా ఆర్జే శేఖర్ బాషా..
ఇక తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అయితే రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. కారణం ఆయనకు కొడుకు పుట్టాడని బిగ్ బాస్ చెప్పడంతో హోస్ట్ నాగార్జున (Nagarjuna)ను వేడుకొని మరీ హౌస్ నుండి బయటకి వచ్చేసారు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా బిగ్ టీవీ నిర్వహించిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పాల్గొని భార్యా బాధితులకు అండగా కామెంట్లు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా సమాజంలో మగవారికి అన్యాయం జరిగితే.. తన గొంతు విప్పుతాను అంటూ మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ బాషా ఈమధ్య కాలంలో ఎక్కువగా భార్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న భర్తలకు అండగా నిలిచారు .
పార్లమెంటులో మగవారి కోసం ప్రత్యేక బిల్ కావాల్సిందే – ఆర్జే శేఖర్ బాషా
ఈ మధ్యకాలంలో ఎక్కువగా భార్యా బాధితులు పెరిగిపోయారని.. ఈ కారణంగానే పార్లమెంటులో అలా అన్యాయం అవుతున్న మగవారి కోసం ప్రత్యేక బిల్లు ఏర్పాటు చేయాలని కోరడానికి తాను పయనం అవుతున్నట్లు తెలిపారు. తాజాగా ఆర్జే శేఖర్ భాషా మాట్లాడుతూ.. “పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి అని ఇక్కడ మొదలుపెట్టిన నినాదం ఏదైతే ఉందో అది ఢిల్లీ వరకు వెళ్లి వినిపించాము. ఢిల్లీలో దాదాపు 2000 మంది కార్యకర్తలు, 90 అర్జీలు.. పార్లమెంటులో ఇవ్వడం జరిగింది. అయితే అలా వెళ్ళిన కార్యక్రమంలో ఒక పెద్ద బ్యానర్ ను కట్టారు. ఆ బ్యానర్ లో గత సంవత్సరం ,ఈ సంవత్సరంలో భార్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల లిస్టు అక్కడ ఉంది. కానీ బహిరంగంగా ఒక సూసైడ్ నోట్ రిలీజ్ చేసి.. ఎందుకు తాను చనిపోతున్నాను అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన అతుల్ సుభాష్ లాంటి వాళ్లు మాత్రమే ఎక్కువ హైలైట్ అయ్యారు.
కొత్త కమిషన్ కోసం పోరాటం..
ఇక్కడ మన కస్టడీకి సంబంధించి, అలాగే 498 కి సంబంధించి, పురుషుల ప్రొటెక్షన్ కోసం, పురుషుల ఆయువు కోసం మహిళా ప్రొటెక్షన్ కమిషన్ లాగా పురుషులకి కూడా పురుషుల ప్రొటెక్షన్ కమిషన్ అవసరం. ఇలాంటి ఎన్నో డిమాండ్లను అక్కడ మేము వినిపించడం జరిగింది. అయితే అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఇంకోసారి వెళ్లి మా గళం విప్పుతాము. మగవారి కోసం ప్రత్యేకమైన కమిషన్ వచ్చేవరకు పోరాడుతాము. ముఖ్యంగా మగవారి సంరక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాల్సిందే” అంటూ ఆర్జే శేఖర్ బాషా కామెంట్లు చేశారు ఇక ప్రస్తుతం భార్యా బాధితులకు అండగా ఆయన ఏకంగా పార్లమెంటులోనే బిల్లు పెట్టి.. కొత్త కమిషన్ తీసుకొస్తామని చెప్పడంతో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:SKN: అతి మంచితనం నష్టానికి మూలం.. అంత కష్టం ఏమొచ్చిందబ్బా!