E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘అఖండ 2’ నష్టాల ఎఫెక్ట్… రూట్ మార్చి పాన్ ఇండియా కథతో వస్తున్న మాస్ డైరెక్టర్!

‘అఖండ 2’ నష్టాల ఎఫెక్ట్… రూట్ మార్చి పాన్ ఇండియా కథతో వస్తున్న మాస్ డైరెక్టర్!
Advertisement

Boyapati Suriya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ మాస్ సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు బోయపాటి శ్రీను. భద్ర సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం తులసి, సింహా, లెజెండ్, సరైనోడు లాంటి భారీ చిత్రాలతో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. థియేటర్లలో హై-వోల్టేజ్ యాక్షన్, భారీ డైలాగులు, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్లు ఉండాలంటే అది బోయపాటికే సాధ్యమనే నమ్మకాన్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు.

ముఖ్యంగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ఆయనకు ఉన్న కెమిస్ట్రీ టాలీవుడ్‌లోనే అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచింది. 2010లో వచ్చిన సింహా, ఆ తర్వాత 2014లో విడుదలైన లెజెండ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించాయి. ఇక కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత 2021 డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన అఖండ ఇండస్ట్రీని షేక్ చేసే వసూళ్లను సాధించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ను, మాస్ పల్స్‌ను బోయపాటి మాత్రమే అన్న ట్యాగ్ పడిపోయింది.

80 కోట్లకు పైగా నష్టాలు 

Advertisement

అయితే ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన విమర్శ కూడా బోయపాటి చుట్టూ తిరుగుతూ వస్తోంది. బాలకృష్ణతో చేసినప్పుడు మాత్రమే వర్కవుట్ అయ్యే ఆ లక్ అండ్ మ్యాజిక్, ఇతర స్టార్ హీరోలతో చేసినప్పుడు ఎందుకో మిస్ అవుతోందనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన దమ్ము (2012), రామ్ చరణ్‌తో తీసిన వినయ విధేయ రామా (2019), అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో 2023లో రూపొందించిన స్కంద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కేవలం అతిగా నమ్మే మాస్ ఫార్ములా, పరిమితులు దాటిన యాక్షన్ సీన్స్ కారణంగానే ఇవి విఫలమయ్యాయనే కామెంట్స్ వచ్చాయి.

also read:సుకుమార్ సినిమాలో చేయాలంటే ఈ హీరోయిన్ ఎన్ని కండీషన్స్ పెట్టిందో తెలుసా ?

Advertisement

ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టాలని, తన సక్సెస్ సెంటిమెంట్‌ను కాపాడుకోవాలని గతేడాది 2025 అక్టోబర్‌లో భారీ అంచనాల మధ్య బాలకృష్ణతోనే అఖండ 2: తాండవం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ, భారీ హైప్ మధ్య విడుదలైన ఈ సీక్వెల్ యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నప్పటికీ, విపరీతమైన బడ్జెట్ మరియు భారీ థియేట్రికల్ బిజినెస్ వల్ల ఈ సినిమా కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌కు చేరలేకపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ  ప్రాజెక్ట్ దాదాపు రూ. 80 కోట్లకు పైగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య 

తన కెరీర్‌లోనే సూపర్ హిట్ అవుతుందనుకున్న ఈ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో బోయపాటి తన మేకింగ్ స్టైల్‌ను మార్చుకోవాలనే ఒత్తిడి పెరిగింది. రొటీన్ ఫార్ములాను నమ్ముకుంటే ఇకపై కష్టమనే సంకేతాలు ట్రేడ్ వర్గాల నుండి బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను రూట్ మార్చారు. ఈ సారి కేవలం టాలీవుడ్ రొటీన్ మాస్ ఎలివేషన్లకే పరిమితం కాకుండా, కథనంలో వైవిధ్యాన్ని చూపిస్తూ కోలీవుడ్ వైపు అడుగులు వేసేపనిలో పడ్డారు.

also read:‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

వెరైటీ  సబ్జెక్టులతో సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ మార్కెట్‌లోనూ గట్టి పట్టు సాధించిన వర్సటైల్ స్టార్ హీరో సూర్యతో బోయపాటి చేతులు కలపడం ఇప్పుడు ఫిలింనగర్‌లో  ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సూర్యకు ఉన్న క్లాస్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, దానికి తోడు బోయపాటి మార్క్ హై-వోల్టేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే వెండితెరపై ఒక సరికొత్త విజువల్ వండర్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే బోయపాటి వినిపించిన ఒక పవర్‌ఫుల్ లైన్‌కు సూర్య ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారో లేదో

ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోందని గ్రహించిన బోయపాటి, ఈ చిత్రాన్ని రొటీన్ కథతో కాకుండా, నార్త్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునేలా ఒక క్రేజీ పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో ప్లాన్ చేస్తున్నారు. 2026 చివరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు, బోయపాటి సమాంతరంగా టాలీవుడ్‌కి చెందిన మరో యంగ్ హీరోతో కూడా కథా చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. మరి ఈ మారిన ట్రెండ్‌కు అనుగుణంగా బోయపాటి తన వింటేజ్ యాక్షన్ స్టైల్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.

Related News

కళ్లముందే తిరిగిన మిత్రుడు ఇక లేడు…భాగ్యరాజ మృతిపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

Kollywood : తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

తెలంగాణ ప్రభుత్వం పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. యూత్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

యూరప్ టూర్‌కు రాజమౌళి సిద్ధం.. ‘RRR’ నుంచి ‘ఈగ’ వరకు స్పెషల్ స్క్రీనింగ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

సుకుమార్ సినిమాలో చేయాలంటే ఈ హీరోయిన్ ఎన్ని కండీషన్స్ పెట్టిందో తెలుసా ?

మిగతా హీరోలు సెట్స్ పైకి.. మోక్షజ్ఞ మాత్రం ఇంకా ముహూర్తాల వేటలోనే!

Big Stories

×