E-Paper
Advertisement

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Kangana Ranaut vs Naseeruddin Shah:కంగనా రనౌత్..కాంట్రవర్సీ లకి కేరాఫ్.ఎవరిని లెక్క చేయకుండా తనదైన శైలిలో ఎటాక్ చేయడం ఈమెకి వెన్నతో పెట్టిన విద్య.ఈసారి ఆమెకి టార్గెట్ అయింది ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా.నీట్ విషయంలో బాలీవుడ్ ప్రముఖుల స్పందనకు సంబంధించి గతంలో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కంగనా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.దేశంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ.. పొరుగు దేశం కోసం పోరాడుతున్నారంటూ షాపై ఆమె ఒక రేంజ్ లో ఫైర్ అయింది.

నసీరుద్దీన్ షాపై కంగనా సంచలన కామెంట్స్

విషయంలోకి వెళ్తే నటుడు పియూష్ మిశ్రా.. నసీరుద్దీన్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ పోస్టును కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

Advertisement

అక్కడితో ఆగకుండా నసీరుద్దీన్ షాను ఉద్దేశించి సెన్సేషన్ కామెంట్స్ చేసింది.ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి ‘కుక్కలే’ అంటూ తనదైన పోలికతో మాట్లాడిన కంగనా.. తాను మాత్రం ఏ దేశపు రొట్టె తింటున్నానో, ఆ దేశానికి కాపలా కాయడాన్ని గర్వంగా భావిస్తానని చెప్పుకొచ్చారు.

‘దేశం తిండి తింటూ.. పొరుగు దేశం కోసం పోరాటం’

నసీరుద్దీన్ షా ఈ దేశంలో ఉంటూ ఇక్కడి తిండి తింటారని, కానీ పొరుగు దేశం కోసం పోరాడతారని కంగనా ఆరోపించారు.అంతేకాదు.. ఆయన్ను ‘నక్క’తో పోలుస్తూ, తాను మాత్రం దేశానికి విశ్వాసంగా ఉండే కుక్కగా ఉండటానికే ఇష్టపడతానని కామెంట్ చేశారు.

Advertisement

కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి.

అసలు ఈ వివాదానికి కారణం ఏంటి?

అసలు ఈ వివాదానికి కారణం ఏంటంటే.. విద్యార్థుల నిరసనలపై నసీరుద్దీన్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు.బాలీవుడ్‌లోని ప్రముఖులు విద్యార్థుల ఉద్యమాలపై ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నకు స్పందించిన నసీరుద్దీన్ షా అప్పట్లో కాస్త ఘాటుగానే మాట్లాడారు.

నోట్లో ఎముక ఉన్న కుక్క మొరగదని, ఆ ఎముక కింద పడిన తర్వాత లేదా దాని పళ్లు విరిగిన తర్వాతే అది మొరుగుతుందంటూ కామెంట్స్ చేశారు.ఇక ఆ సమయంలో ఆయన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.

పియూష్ మిశ్రా వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి

ఇప్పుడు జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా పియూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలతో ఆ పాత విషయం మరోసారి తెరపైకి వచ్చింది.నసీరుద్దీన్ షా అప్పట్లో చెప్పిన ‘కుక్క’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ఏ కుక్కలు మౌనంగా ఉన్నాయంటూ పియూష్ మిశ్రా ప్రశ్నించారు.

దీనికి సంబంధించిన వార్తను కంగనా షేర్ చేయడంతో పాటు నసీరుద్దీన్ షాపై డైరెక్ట్ గా ఎటాక్ చేయడం ఇపుడు తో వివాదం మరింత ముదిరింది.

కంగనాకు వివాదాలు కొత్తేమీ కాదు

నిజానికి కంగనా రనౌత్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’, ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కంగనా.. తన సినిమాల కంటే తన స్ట్రెయిట్‌ఫార్వర్డ్ స్టేట్‌మెంట్స్‌తో కూడా పలు సార్లు మీడియాలో హైలెట్ అయింది కూడా.

నసీరుద్దీన్ షా.. విలక్షణ నటుడు

ఇక నసీరుద్దీన్ షా విషయానికి వస్తే.. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుల్లో ఆయన ఒకరు.‘స్పర్శ్’, ‘ఆక్రోష్’, ‘జానే భీ దో యారో’, ‘మాసూమ్’, ‘మండి’, ‘ది డర్టీ పిక్చర్’ వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక, ఆర్ట్ సినిమాల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

సామాజిక, రాజకీయ అంశాలపై ఓపెన్‌గా స్పందించే షా

అయితే నసీరుద్దీన్ షా కేవలం నటుడిగానే కాకుండా.. సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పే వ్యక్తిగా మంచి పేరుంది.కంగనా రనౌత్ కూడా ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గకుండా తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పే వ్యక్తి కావడంతో.. ఇద్దరి పేర్లు మరోసారి ఒకే వివాదంలోకి వచ్చాయి.

also read :డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

నసీరుద్దీన్ షా ఎలా రియాక్ట్ అవుతారో?

కంగనా వ్యాఖ్యలపై కొందరు ఆమె ధైర్యంగా మాట్లాడుతున్నారని సమర్థిస్తుంటే.. మరికొందరు ఒక సీనియర్ నటుడిపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు.అసలు కంగనా చేసిన ఆరోపణలకు నసీరుద్దీన్ షా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags

Related News

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

తెలంగాణ సంస్కృతి చూసి ఫరియా కంటతడి.. అసలేం జరిగిందంటే?వీడియో వైరల్!

ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

Big Stories

Advertisement
×