Jr NTR: సినిమా ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు అభిమానులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ (Varun Tej), కొరియన్ కనకరాజు(Korean kanakaraju), రామ్ చరణ్(Ram Charan) పెద్ది(Peddi movie) , బాలకృష్ణ(Balakrishna ) NBK 111 సినిమా షూటింగ్లలో గాయపడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్ తన చేతి మణికట్టుకి సర్జరీ చేయించుకోగా.. బాలకృష్ణ కూడా తన మోకాలికి సర్జరీ చేయించుకుని.. ప్రస్తుతం తమ సినిమాల షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత నెల 27వ తారీఖున ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ గాయపడ్డారు అని అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కార్యాలయం నుండి మరో ప్రకటన బయటకు వచ్చింది. ఈ మేరకు ప్రకటనలో వెలువడిన సమాచారం ప్రకారం..” ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స జరగనుంది. ఎన్టీఆర్ త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా ప్రత్యేక బృందం ఆయనకు ఆగస్టు 12వ తేదీన శస్త్ర చికిత్స అందిస్తోంది. తర్వాత ఆయన ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ కార్యాలయం ఎప్పటికప్పుడు అధికారికంగా తెలియజేస్తుంది. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వైద్యుల సమక్షంలో శస్త్ర చికిత్స జరగనుంది. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారు” అంటూ ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది . ఇకపోతే ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శస్త్ర చికిత్స సక్సెస్ కావాలి అని , ఎన్టీఆర్ త్వరగా ఆరోగ్యంగా రికవరీ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
also read:‘రంభ ఊర్వశీ మేనక’ టీజర్ రిలీజ్.. ముగ్గు గీస్తే దిగొస్తారా ?
గత నెల 27వ తేదీన ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.. అందులో..” ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన పూర్తిగా , సజావుగా కోలుకోవడానికి 6 నుండి 8 నెలల సమయం పడుతుందని , సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఆరోగ్యంగా కోలుకునే వరకు సంబంధించిన ప్రతి అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో తెలియజేస్తూనే ఉంటాము. మీ సపోర్టుకు ధన్యవాదాలు అంటూ చిత్ర బృందం వెల్లడించింది. ఇకపోతే ఎన్టీఆర్ భుజానికి ఆ గాయం ఎక్కడ ?ఎలా జరిగింది? అనే విషయాన్ని మాత్రం ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించలేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోబోతున్న నేపథ్యంలో డ్రాగన్ మూవీ వాయిదా పడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.