E-Paper
Advertisement

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!
Advertisement

Mahesh Babu as Lord Rama:సినిమాలో రాముడిగా మహేష్ బాబు కనిపిస్తాడన్న వార్తలు బయటికి వచ్చాయో లేదో ఇదిగో ఇలా ఉండబోతున్నాడు,లేదు అలా ఉండబోతున్నాడు అంటూ ఎవరికీ వారు ఫ్యాన్ మేడ్ వీడియోలు చేస్తూనే ఉన్నారు.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫ్యాన్ మేడ్ వీడియో మాత్రం అంచనాలని మరో లెవెల్ కి తీసికెళ్ళింది.

సినిమా నుంచి కనిపిస్తున్న కొన్ని విజువల్స్‌ను కలిపి చేసిన ఈ ఎడిట్ చూసి ఫ్యాన్స్ అయితే ‘ఇది సినిమా కాదు.. వేరే లెవల్’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి మార్క్ విజువల్స్

Advertisement

రాజమౌళి సినిమా అంటేనే భారీ సెట్స్, అదిరిపోయే యాక్షన్, కళ్లు చెదిరే విజువల్స్ కామన్. ఈసారి మహేష్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్‌లో కూడా అదే రేంజ్ కనిపిస్తోంది.ముఖ్యంగా ఆఫ్రికన్ లొకేషన్స్, దట్టమైన అడవులు, భారీ యాక్షన్ సీన్స్, మంటలు, దూసుకొచ్చే ఎద్దులు.. ఇలా ఒక్కో విజువల్ చూస్తుంటే సినిమా ఎంత పెద్ద స్కేల్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.

మహేష్ క్యారెక్టర్‌పై పెరుగుతున్న ఆసక్తి

ఇక ఈ ఎడిట్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తెగ షేర్ చేస్తున్నారు. వేలల్లో లైక్స్, కామెంట్లు రావడంతో పాటు వీడియో చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది.సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతాడు? ఆయన క్యారెక్టర్ ఏంటి? కథలో రామాయణానికి ఉన్న లింక్ ఏంటి? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.

రుద్ర, శ్రీరాముడిగా మహేష్?

Advertisement

మహేష్ బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. రుద్ర, శ్రీరాముడి పాత్రల్లో మహేష్ కనిపిస్తాడనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిందే.ఇక ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ బట్టి చూస్తే మాత్రం సినిమా కథలో పురాణ అంశాలు, అడ్వెంచర్, యాక్షన్ అన్నీ కలిసేలా కనిపిస్తున్నాయి.

స్టార్ కాస్ట్‌తో భారీ అంచనాలు

ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.

దీంతో సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఉండటం వల్ల సినిమాకు గ్లోబల్ మార్కెట్ కూడా బాగా కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

సినిమాపై కాంట్రవర్సీలు కూడా..

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామాయణానికి సంబంధించిన అంశాలను సినిమాలో ఎలా చూపిస్తారనే దానిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు రాజకీయ వర్గాలకు చెందిన వారు సినిమా విషయంలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఏకంగా సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే సినిమా ఇంకా పూర్తిగా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఇలాంటి కాంట్రవర్సీలు ఎన్ని జరిగితే సినిమాకి అంత ఫ్రీ పబ్లిసిటీనే దక్కుతోందనేది మహేష్ బాబు అభిమానుల వాదన.

మహేష్–రాజమౌళి కాంబినేషన్‌పై భారీ హైప్

అసలు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ అనేది చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ కల. ఇప్పుడు ఆ కల నిజం కావడంతో సినిమా విడుదలకు ముందే రచ్చ మొదలైంది.మహేష్ నుంచి ఇప్పటివరకు చూడని యాక్షన్‌ను రాజమౌళి చూపించబోతున్నాడనే టాక్ ఇప్పటికే వైరల్ అవుతోంది. పైగా భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లాంటి స్టార్ కాస్ట్.. ఇవన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

2027 ఏప్రిల్ 7న సినిమా రిలీజ్

మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్ తనకు చాలా స్పెషల్ అని చెప్పడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి ఇంకా పెరిగింది. 2027 ఏప్రిల్ 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అంటే సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ అప్పుడే సోషల్ మీడియాలో ఇంత హంగామా జరుగుతుంటే.. టీజర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, ట్రైలర్ పడితే ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతుందో ఊహించుకోవచ్చు.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా?

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఎడిట్ చూస్తుంటే సినిమా మీద ఉన్న హైప్ ఏంటో మరోసారి అర్థమవుతోంది.మరి రాజమౌళి–మహేష్ కాంబో నిజంగానే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? తెలియాలంటే 2027 ఏప్రిల్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే!

Tags

Related News

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

తెలంగాణ సంస్కృతి చూసి ఫరియా కంటతడి.. అసలేం జరిగిందంటే?వీడియో వైరల్!

ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

జేబులో రూ.500.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తి.. రవికిషన్ జర్నీ మామూలుగా లేదుగా!

‘రంభ ఊర్వశీ మేనక’ టీజర్ రిలీజ్.. ముగ్గు గీస్తే దిగొస్తారా ?

హీరోయిన్ రాధికకి కూడా తప్పని డబ్బా తిప్పలు.. నిరూపించుకున్నారు మేడం!

Big Stories

Advertisement
×