E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ప్రేమ మాటకు షాక్.. అయ్యో ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 12th : పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తూ ఉంటారు. కుంకుమార్చన చేయాలి అంటే శాస్త్రోపేతంగా చేయాలి అని అక్కడున్న పంతులు అంటాడు. కానీ భద్ర మాత్రం నేను తొందరగా వెళ్ళి పోవాలి తొందరగా చదవండి అని తొందర పెడుతూ ఉంటుంది.. శ్రీవల్లి మీరు తొందరగా వెళ్ళిపోండి అని ఒకపక్క సైగలు చేస్తూ ఉంటుంది. పూజారి అమ్మవారికి కుంకుమభిషేకం చేసిన కుంకుమ ని ఆడవాళ్ళకి ఇచ్చే మీ భర్తలతో నుదుట బొట్టు పెట్టించుకోండి. మీ భర్తకి క్షేమంగా ఉంటుంది అని చెప్తాడు.. అందరూ కూడా తమ భర్తలతో బొట్టు పెట్టించుకుంటారు.. కానీ ప్రేమ దగ్గరికి వచ్చేలోగా ప్రేమ మరేం పర్వాలేదు అని ఎంత చెప్తున్నా సరే వినకుండా మొండిగా ఉంటుంది..

అమూల్య మాటతో విశ్వం హర్ట్…

అమూల్యతో మాట్లాడాలని పిలిచిన విశ్వం కు అమూల్య ప్రవర్తనతో కాసేపు గొడవపడతారు.. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మాట్లాడుకొని ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమ వదినని గుడికి తీసుకుని వచ్చావు బాగానే ఉంది కానీ వదినతో మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అలా మీ అత్త లాక్కొని వెళ్ళిపోతుంది.. అయితే ఎలాగైనా సరే ప్రేమ వదినతో మాట్లాడితే ఏదో ఒకటి తేలిపోతుంది అని అమూల్య అనుకుంటుంది. అమూల్య మా వదినతో ఒంటరిగా మాట్లాడే అవకాశం నాకు కల్పించు ఆ తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంటుంది. విశ్వం అమూల్య పై ప్రేమతో తను ఏం చెప్తే అది చేస్తాను అని అంటాడు.

ధీరజ్ కు దెబ్బ తగిలింది..

Advertisement

ధీరజు ప్రేమ ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అటు ప్రేమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది.. నా మనసుని నువ్వు గాయపరిచావు అందుకే నేను ఇలా మొండిగా ప్రవర్తించాను అని బాధపడిపోతూ ఉంటుంది ప్రేమ.. అప్పుడే ధీరజ్ అక్కడ ఉన్న ఓ పెద్దాయన పడిపోతూ ఉంటే.. అతని పట్టుకొని ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు.. అయితే ధీరజ్ మాత్రం ఆ పెద్దాయనని పట్టుకొని ఏమైంది అని అడుగుతాడు.. కాస్త లోబిపి బాబు అందుకే కళ్ళు తిరిగాయి అని చెప్పగానే సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని పంపిస్తాడు.. ఇక తర్వాత ధీరజు ఒక పందిరి కింద నిలబడతాడు అది తన మీద పడిపోవడంతో ధీరజ్ కి దెబ్బ తగులుతుంది అప్పుడే బయటకు వచ్చిన రామరాజు కుటుంబం కి దెబ్బ తగిలింది అని ధీరజ్ కి ఏమైందో నీ కంగారు పడిపోతూ ఉంటారు.

కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..

ధీరజ్ కి దెబ్బ తగిలిందని తెలుసుకున్న ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోతుంది. ధీరజ్ కళ జరిగింది అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. ప్రేమ దూరం నుంచి ధీరజ్ కి ఏదో జరిగిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది.. ప్రేమ ధీరజ్ కి బాగా లేదు కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్లి అర్చన చేయించాలి అని అనుకుంటుంది.. దేవుడి దగ్గరికి వెళ్లి అక్కడున్న పూజారి దగ్గరికి వెళ్లి నా భర్త పేరు ధీరజ్ అతని పేరు మీద అర్చన చేయండి అని బ్రతిమలాడుతుంది.. ఇందాక భర్త పేరు చెప్పమంటే చెప్పలేదు కదా ఇప్పుడు ఏంటమ్మా ఇలా భర్త పేరు చెప్తాను అని అంటున్నారు అంటే ముందు అతని పేరు మీద అర్చన చేయండి అని అంటారు. ధీరజ్ కు ఏమి కాకుండా ఉండాలి అని ముక్కుకుంటుంది..

ధీరజ్ మాటతో షాక్..

Advertisement

ప్రేమ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చిన ధీరజ్ కి ప్రేమ కనిపించడంతో చాలా సంతోషంగా ప్రేమ దగ్గరికి వెళ్తాడు.. ధీరజ్ ని చూడగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాట్లాడడానికి చాన్స్ కూడా ఇవ్వవా ఎందుకలా నన్ను బాధ పెడుతున్నావు అని అంటాడు. అసలు ఎంతగా ధీరజ్ మాట్లాడడానికి ప్రయత్నించినా సరే.. ప్రేమ మాత్రం మాట వినకుండా ఉండడంతో అక్కడికి వచ్చి నన్ను నర్మదా వేదవతి కూడా ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నించిన కూడా తను మాత్రం వినకుండా వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. కానీ అందరూ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రేమ మాత్రం నన్ను వదలండి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది. ధీరజ్ ప్రేమతో మాట్లాడాలి అని చేయి పట్టుకుంటాడు. కానీ తన జాకెట్టు చినిగిపోతుంది ఇక తర్వాత భద్ర కుటుంబం చేసిన రచ్చ అంత ఇంత కాదు.. ఇక ప్రేమ మాట్లాడిన మాటతో ధీరజ్ చాలా బాధపడతాడు.. రామరాజు ధీరజ్ ని తిడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. గోరింటాకు పెట్టుకున్న కోడళ్లు.. పల్లవి పై అవనికి అనుమానం..

Related News

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

బిగ్ బాస్ 10 సుధీర్ బర్త్డే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్!

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. అస్సలు ఊహించలేదు కదా..

Big Stories

Advertisement
×