Surekha Vani:సురేఖ వాణి…ఇప్పుడు కాస్త స్లో అయింది కాని, ఒకప్పుడు ఏ సినిమాల్లో చూసినా ఈవిడే కనిపించేది. తల్లి, అక్క, వదిన ఇలా ఏ పాత్ర వేయాలన్నా ఈవిడే అన్నట్టుగా ఉండేది.అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సురేఖ వాణి ఇప్పుడు మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నారు. అందుకే తన ఫిట్‌నెస్‌పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు.
తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సురేఖ వాణి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆమె ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 50కి దగ్గర్లో ఉన్నా ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. వయసు పెరుగుతున్నా గ్లామర్‌లో మాత్రం ఏమాత్రం తగ్గలేదంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
తన భర్త సురేష్ తేజతో కలిసి ‘మా టాకీస్’, ‘హార్ట్ బీట్’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు.ముఖ్యంగా ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షో మంచి హిట్ కావడంతో ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది. అలా ‘శ్రీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత సురేఖ వాణికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘దుబాయ్ శీను’, ‘రెడీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఓయ్’, ‘ఏమాయ చేశావె’, ‘బావ’, ‘ఓం నమో వెంకటేశ’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘దేనికైనా రెడీ’, ‘నాయక్’, ‘బాద్ షా’, ‘శ్రీమంతుడు’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’ లాంటి సినిమాల్లో నటించారు.
చిన్న పాత్ర అయినా సరే.. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేవారు.
అయితే కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే సురేఖ వాణి భర్త సురేష్ తేజ చనిపోవడంతో ఆమె జీవితంలో పెద్ద విషాదం చోటుచేసుకుంది.భర్తను కోల్పోయిన తర్వాత కూతురు సుప్రీతను చూసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. సింగిల్ పేరెంట్‌గా కూతురిని పెంచి పెద్ద చేశారు.
సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరూ కలిసి చేసే ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.వాళ్ల డ్రెస్‌లు, ఫోటోలు, లైఫ్‌స్టైల్‌పై కొంతమంది ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు నచ్చినట్టుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు సుప్రీతను కూడా ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు సురేఖ వాణి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన కూతురే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు.
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణికి ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘నీరం’ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం.మరికొన్ని సినిమాల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి గట్టిగా రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది.
also read :మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్
మొత్తానికి ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణి ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.ఈసారి ఎలాంటి పాత్రలు చేస్తారు? మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతారా? అనేది చూడాలి.ఏదేమైనా జిమ్ వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సురేఖ వాణి.. రీఎంట్రీపై మాత్రం మంచి ఆసక్తి పెంచేశారు.
చూడాలి మరి రీ ఎంట్రీలో ఈ వెటరన్ ఆంటీ ఎలాంటి సక్సెస్ చూస్తుందో !