Trisha Posts:త్రిష..ఇప్పుడీ పేరుని కోలీవుడ్ నామ స్మరణ చేస్తుంది.విజయ్ సీయం సీటు ఎక్కినప్పటి నుండి త్రిష పేరు వినబడని రోజే లేదంటే ఆశ్చర్యం లేదు.ఇక తాజాగా ఉదయనిది చేసిన కామెంట్స్ తో మరోసారి త్రిష వైరల్ కాగా ఇపుడు త్రిష సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
మాములు తన వ్యక్తిగత విషయాలపై పెద్దగా మాట్లాడని త్రిష.. ఈసారి వరుసగా కొన్ని మోటివేషనల్ కోట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టింది. అందులో కొన్ని మెసేజ్‌లు చూస్తే మాత్రం.. ఇవి ఉదయనిదిని ఉద్దేశించి పెట్టినవేనా? అనే డౌట్ మొదలైంది.
ఉదయనిధి స్టాలిన్ చుట్టూ వివాదం నడుస్తున్న టైమ్‌లోనే త్రిష ఈ పోస్టులు పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చ మరింత పెరిగింది.అయితే త్రిష మాత్రం ఎక్కడా ఉదయనిధి పేరు చెప్పలేదు. దీంతో అసలు ఈ పోస్టుల వెనుక కథేంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఈమధ్యే త్రిష తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలతో పాటు కొన్ని కోట్స్ కూడా పెట్టింది.వాటిలో ఒక మెసేజ్ మాత్రం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది.
“ఈ వయసులో కూడా డ్రామాలు చేయడం ఎందుకు? నీ పని నువ్వు చూసుకో.. డబ్బు సంపాదించుకో.. ప్రశాంతంగా ఉండు” అనే అర్థం వచ్చే మెసేజ్‌ను త్రిష షేర్ చేసింది.అంతేకాదు.. దానికి కనుబొమ్మ పైకెత్తిన ఎమోజీని కూడా పెట్టింది. దీంతో ఈ పోస్ట్ ఎవరికి ఇచ్చిన కౌంటర్? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన మెసేజ్‌ను కూడా ఆమె షేర్ చేసింది.“నువ్వు చేసే ప్రతి పని తిరిగి నీ దగ్గరకే వస్తుంది. కాబట్టి మంచిగా ఉండు.. మంచే చేయి” అనే అర్థం వచ్చే కోట్ అది.దాంతో పాటు “ఇకపై నీ జీవితంలో అన్నీ సవ్యంగా జరిగే కొత్త అధ్యాయం మొదలైంది” అనే మెసేజ్‌ను కూడా పెట్టింది.
ఇంకో పోస్ట్‌లో “రిస్క్ తీసుకునేవారే గెలుస్తారు” అనే కోట్ కనిపించింది.మరోచోట “ఒకప్పుడు కావాలనుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవడం కూడా ఒక అదృష్టమే” అనే మెసేజ్‌ను షేర్ చేసింది.
ఇన్ని పోస్టులు ఒకేసారి రావడంతో.. త్రిష ఏదో చెప్పాలనుకుంటుందా? కానీ నేరుగా చెప్పకుండా ఇలా కోట్స్ రూపంలో తన అభిప్రాయాన్ని చెబుతోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ వివాదం తర్వాత ఇవి రావడంతో నెటిజన్లు ఆ పోస్టులను అదే కోణంలో చూస్తున్నారు.
అసలు వివాదం ఏంటంటే.. ఇటీవల కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని మాట్లాడారు.ఆ సమయంలో అక్కడ కొందరు త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనిపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో త్రిష మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.
అలాంటిది ఇప్పుడు తాజాగా ‘డ్రామాలొద్దు’, ‘నీ పని చూసుకో’, ‘మంచిగా ఉండు’, ‘అన్నీ సవ్యంగా జరుగుతాయి’ అంటూ వరుస పోస్టులు పెట్టడంతో.. ఇవి ఆ వివాదానికి సంబంధించినవేనా? అనే చర్చ మళ్లీ మొదలైంది.అయితే ఇక్కడ త్రిష తన పోస్టుల్లో ఎక్కడా ఉదయనిధి పేరు ప్రస్తావించకపోవడాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇక త్రిషకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంది.ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితం, సినిమాలు, ఇతర సెలబ్రిటీలతో సంబంధాలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఇలాంటి సమయంలో ఆమె ఒక్క చిన్న కోట్ పెట్టినా దాని వెనుక ఏదో పెద్ద స్టోరీ ఉందేమో అని నెటిజన్లు వెతకడం చాలా కామన్ కూడా.
also read :మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్
చూడాలి మరి త్రిష పెట్టిన ఈ ఇన్ డైరెక్ పోస్ట్ లకి ఎవరు కౌంటర్ ఇస్తారో!