Shehnaaz Gill:సినిమా ఇండస్ట్రీ.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మరికొన్ని సార్లు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇదిగో అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు హీరోయిన్ షెహనాజ్ గిల్ విషయంలో జరిగింది. ఇప్పుడు ఆ వార్తే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం.
పంజాబీ సినిమా ఇష్క్‌నామా షూటింగ్ సాగుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే మజా ఏముంటుంది. ఇదిగో హీరోయిన్ షెహనాజ్ గిల్ షూటింగ్‌లో పరిగెడుతున్న సమయంలో ఆమె పెట్టుకున్న ముక్కుపుడక ఊడిపోయి ఏకంగా నోట్లో పడింది.
ఆమె వెంటనే దగ్గడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న నటుడు సౌరభ్ సచ్దేవా వెంటనే స్పందించి ఆమె వీపుపై తట్టి సహాయం చేశాడు. ఈ మొత్తం సంఘటనను షెహనాజ్ స్వయంగా వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అసలు విషయం ఏంటంటే.. ఈ ఘటనను షెహనాజ్ దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా అభిమానులతో షేర్ చేసుకుంది. “నథ్నీ మూమెంట్” వీడియో కోసం చాలామంది అడుగుతున్నారని చెప్పి ఈ బీహైండ్ ది సీన్స్ వీడియోను పోస్ట్ చేసింది.
ఇక ఈ వీడియో ఇలా బయటికి వచ్చిందో లేదో పిచ్చపిచ్చగా రియాక్ట్ అయిపోయారు మూవీ లవర్స్.
వీడియో చూసిన కొంతమంది అభిమానులు మాత్రం నవ్వుకోవడం పక్కనపెట్టి షెహనాజ్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాంటి సీన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అంటూ కామెంట్లు పెట్టారు.
మరికొందరు మాత్రం ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా షూటింగ్ చేయడాన్ని చూసి మెచ్చుకున్నారు. మొత్తానికి ఓ చిన్న నోస్ రింగ్ కారణంగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిందన్న మాట.
ఇక షెహనాజ్ గిల్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ 13తో ఆడియన్స్‌కు బాగా దగ్గరైన ఈ భామ టీవీ నుంచి సినిమాల వైపు వెళ్లి తన కెరీర్‌ను మెల్లగా బిల్డ్ చేసుకునే పనిలో పడింది.
ఇప్పటికే పంజాబీ సినిమాల్లో సత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్, కాలా షా కాలా, హోన్స్లా రాఖ్ వంటి సినిమాల్లో కనిపించి మెప్పించిన షెహనాజ్.. హోన్స్లా రాఖ్ లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో, అలాగే థ్యాంక్యూ ఫర్ కమింగ్ లోనూ నటించి హిందీలోనూ సత్తా చూపే పనిలో పడింది.
అయితే ప్రస్తుతం షెహనాజ్ పంజాబీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని బాధపడటం కంటే.. తనకు నచ్చిన కథలు, పాత్రలు వస్తేనే చేయాలని చూస్తున్నట్టు ఈమధ్యే చెప్పింది కూడా.
ఇక ఇప్పుడు ఆమె చేస్తున్న ఇష్క్‌నామా కూడా పంజాబీ నేపథ్యంలోని ప్రేమకథే. అరవిందర్ ఖైరా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షెహనాజ్ గిల్, జయ్య్ రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్దేవా, అంజుమ్ బత్రా తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇండియా పంజాబ్‌కు చెందిన ఓ సిక్కు యువకుడు, పాకిస్థాన్ పంజాబ్‌కు చెందిన ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
ఇదిలా ఉంటే షెహనాజ్ చేతిలో మరో ఆసక్తికరమైన సినిమా కూడా ఉంది. గిప్పీ గ్రేవాల్‌తో కలిసి ఆమె *సింగ్ వర్సెస్ కౌర్ 2*లో నటిస్తోంది. నవనియత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి షూటింగ్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం షెహనాజ్ గిల్‌ను మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిందన్న మాట.
ముక్కుపుడక మింగేసిన హీరోయిన్
బాలీవుడ్ నటి, గాయని షెహనాజ్ గిల్‌కు ఊహించని అనుభవం#shehanajgill #panjabicinema #ishqnama pic.twitter.com/Jy8QEA2DT6
— BIG TV Cinema (@BigtvCinema) August 11, 2026