Bhogi Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. ఈ మధ్యకాలంలో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ కానీ సరైన సమయంలో రిలీజ్ చేయకపోవడం వల్లే ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రకటించిన చిత్రం భోగి.
ఒక కొత్త తరహా పాత్రలో ఈ సినిమాలో శర్వానంద్ కనిపించనున్నారు. పైగా దర్శకుడు సంపత్ నంది – శర్వానంద్ కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధా మోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణలో భాగంగా.. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో ఎమోషన్స్, యాక్షన్ తో నిండిన క్లైమాక్స్ సన్నివేశాలను గత నెల రోజుల క్రితం చాలా పగడ్బందీగా తెరకెక్కించారు. పైగా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే ఈ సినిమా సెట్ ను రూపొందించగా.. ప్రముఖ ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బారాయన్ యాక్షన్ సీన్స్ ని చాలా చక్కగా డిజైన్ చేశారు.
ALSO READ:రక్త చరిత్ర -3 పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!
ముఖ్యంగా ఈ సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ కోసం శర్వానంద్ కఠినమైన స్టంట్స్ కూడా చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. సుమారుగా 20 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ కూడా స్పష్టం చేశారు. పైగా ఈ సినిమాను ఆగస్టు 28వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలా అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే సమయంలో సడన్గా ఇప్పుడు భోగికి బోలెడు కష్టాలు వచ్చి పడినట్లు సమాచారం.
డైరెక్టర్ సంపత్ నంది సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే సుమారుగా 40 కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయించినట్లు సమాచారం. ఇంకా ప్రమోషన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండగా.. ఇలాంటి సమయంలో అదనంగా ఇప్పటికే 40 కోట్లు అంటే, ఇంకా మిగతా పనులను ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి..ఈ నేపథ్యంలోనే అటు దర్శకుడికి, ఇటు ప్రొడ్యూసర్ కి మధ్య బడ్జెట్ విషయంలో విభేదాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి.కథ క్లైమాక్స్ కి చేరుకున్న నేపథ్యంలో సడన్గా డైరెక్టర్ కి , నిర్మాతకి మధ్య ఈ విభేదాలు సినిమా విడుదలను ఆపివేస్తాయా అనే అనుమానాలు ఇప్పుడు అభిమానులలో నెలకొన్నాయి. ఒకవైపు బడ్జెట్ పెరిగిపోవడం మరొకవైపు సరైన బిజినెస్ జరగకపోవడంతో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్య ఎప్పుడు సర్దుమణుగుతుందో చూడాలి.
ఏమైంది ఈవేళ అనే చిత్రంతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది.. ఆ తర్వాత రచ్చ, గౌతమ్ నంద , సీటీ మార్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల విరామం తర్వాత భోగి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అటు శర్వానంద్ కూడా తన మార్కెట్ ను పెంపొందించుకోకపోవడం , ఇటు సరైన హిట్ కోసం డైరెక్టర్ పాకులాడడం, దీనికి తోడు బడ్జెట్ కష్టాలు అన్నీ అనుమానాలు పెంచేస్తున్నాయి . మరి అనుకున్న సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? వస్తే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.