E-Paper
Advertisement

రక్త చరిత్ర -3 పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

రక్త చరిత్ర -3 పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!
Advertisement

Ram Gopal Varma:ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 2010లో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రక్త చరిత్ర. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాటి రాజకీయ అంశాలను తెరపై చూపిస్తూ రగిలించిన చిచ్చు ఒక జ్వాలలా వెలిగింది. ఇక అలాంటి ఈ సినిమా అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసి ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రక్త చరిత్ర ..

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ , రాధిక ఆప్టే, సూర్య, ప్రియమణి తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా జూలై 17వ తేదీన రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..” రాయలసీమలో జరిగిన నిజ జీవిత సంఘటనలను బాగా అధ్యయనం చేసిన తర్వాతే రక్త చరిత్ర సినిమాను రూపొందించాము. నా కెరియర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఇది కూడా ఒకటి. ప్రతీకారం, హింస చివరికి ఎంతటి వినాశనానికి దారితీస్తాయో చూపించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం” అంటూ రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ:సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

రక్త చరిత్ర పార్ట్ 3 పై వర్మ క్లారిటీ..

ఇదే మీడియా సమావేశంలో రక్త చరిత్ర పార్ట్ 3 వచ్చే అవకాశం ఉందా ? అని ప్రశ్నించగా.. వర్మ మాట్లాడుతూ.. “రెండో భాగంలోనే ప్రధాన పాత్రల కథ ముగిసిపోయింది. ఇక దానికి కొనసాగింపుకి అవకాశం లేదు. కాబట్టి రక్త చరిత్ర పార్ట్ 3 రాదు అంటూ ఆయన తేల్చి చెప్పేశారు. ఇక ప్రస్తుతం అలాంటి కథను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇక రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గిపోయిన ఈ సమయంలో సినిమాను మళ్ళీ విడుదల చేయడం వల్ల పాత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారా? అనే ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో మాటలు యుద్ధం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఒకప్పుడు జరిగినట్లుగా బహిరంగంగా తలపడే పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్లో లేదు” అంటూ వర్మ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అలాంటి సినిమాలు అంటేనే ఇష్టం – వర్మ

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో వర్మ తన సినీ ప్రయాణంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయను. కుటుంబంతో కలిసి సినిమా చూసే సమయంలో ప్రతి ఒక్కరు వేరువేరు విషయాలపై దృష్టి పెడతారు. అలాంటి కథలు నాకు ఆసక్తి కలిగించవు. అలాగే పౌరాణిక చిత్రాలపై నాకు ఆసక్తి లేదు. భారీ సెట్స్ ,కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే ఈ తరహా సినిమాల కంటే నిజజీవిత సంఘటనలు వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందించే రియలిస్టిక్ డ్రామాలు అంటేనే నాకు చాలా ఇష్టం. ఇక ప్రస్తుతం హిందీలో పోలీసు వ్యవస్థ నేపథ్యంలో ఒక సినిమా రూపొందిస్తున్నాను అందుకే నేను ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను అంటూ తెలిపారు వర్మ.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

భోగికి బోలెడు బడ్జెట్ కష్టాలు.. విభేదాలే కారణమా?

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

బిచ్చగాడు ప్లస్ పోకిరి.. పూరి ఐడియా వర్కవుట్ అవుతుందా?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!

Lenin Movie : హే అఖిల్ కంగ్రాట్స్.. ‘లెనిన్’ సక్సెస్ పై ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..

‘రావు బహదూర్ ‘ మూవీ పై ప్రియదర్శన్ కామెంట్స్..ఇది అస్సలు ఊహించలేదు బ్రో..!

Big Stories

Advertisement
×