Sree Leela:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని అటు సోషల్ మీడియా వేదికగా క్యాష్ చేసుకుంటున్నారు. పలు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న ఈ సెలబ్రిటీలు.. ఆ ఉత్పత్తులకు సంబంధించి ఒక్క పోస్ట్ పెడితే చాలు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు తమ ఖాతాలో ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ప్రముఖ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ.5నుండి రూ.8లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో బ్యూటీ వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు అందాల తార శ్రీ లీల.
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీ లీల…ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ‘ధమాకా’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఈమె చేస్తున్న ప్రతి సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంటుంది. కానీ కమర్షియల్ సక్సెస్ అయితే లభించడం లేదు. అయినా సరే శ్రీ లీలా డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. నిజానికి శ్రీ లీల ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అంటే అదే సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనుకాడదు. అలా రెండు రకాలుగా ఈమె నిర్మాతలకు అండగా నిలుస్తోంది. తన అద్భుతమైన నటనతో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది
మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క ప్రమోషనల్ పోస్టుకి సుమారుగా రూ.5నుండి రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇన్స్టా లో సుమారుగా 1.6 కోట్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది శ్రీ లీల. ఇక అందుకే ఆమె ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుండి రూ.4కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీలీల ఒక పోస్ట్ కి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం చూసి ఆమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది అంటు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:భోగికి బోలెడు బడ్జెట్ కష్టాలు.. విభేదాలే కారణమా?
ఇదిలా ఉండగా మరొకవైపు చివరిగా పరాశక్తి, మాస్ జాతర,ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో కలిసి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇదిలా ఉండగా జూలై 10వ తేదీన అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా విడుదలయ్యింది. ఇందులో మొదట హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు. కాకపోతే లెనిన్ సినిమా కథలో మార్పులు కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం.. మరొకవైపు శ్రీ లీల పరాశక్తి సినిమా షూటింగ్ లో బిజీ కావడంతో డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో శ్రీ లీల సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి భాగ్యశ్రీ వచ్చి మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.