Bunny Politics:రాజకీయాల్లోకి సినిమా స్టార్స్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు.ఎన్టీఆర్, ఏమ్జీఆర్, జయలలిత వంటి వారు ఏకంగా “సీఎం పీఠం పై కూర్చున్నారు కూడా.చిరంజీవి,కమల్ వంటి వారు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు.ఇక ఎన్నో డక్కా మొక్కీలు తిన్న పవన్ కళ్యాన్ గత ఎన్నికల్లో విజయడంకా మోగించి డిప్యూటీ సీయం అయిపోయాడు.
ఇవన్ని ఇలా ఉంటె లేటెస్ట్ గా తమిళ వెట్రి కలగం (TVK)అనే పార్టీ పెట్టి తమిళ దళపతి విజయ్ సీయం పీటం ఎక్కడం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.ఇపుడు వారి బాటలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగులేస్తున్నాడంటూ వస్తున్న వార్తలతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.అవును …పుష్ప సిరీస్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టేసిన మన బన్నీ ఇపుడు పాలిటిక్స్ లోకి వస్తున్నాడన్న ఊహాగానాలు మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.
బన్నీ సీయం అవుతాడా లేదా
ఎలా అయితే దలపతి విజయ్ తన ఫ్యాన్ అసోసియేషన్లను అందరిని ఒక దగ్గరకి చేర్చి స్ట్రాంగ్ గా మార్చాడో ఇపుడు బన్నీ కూడా అదే పొలిటికల్ మోడ్ ని ఫాలో అవుతున్నాడని, అందులో భాగంగా తన ‘అల్లు అర్జున్ ఆర్మీ’ని సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తూ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
also read:బిచ్చగాడు ప్లస్ పోకిరి.. పూరి ఐడియా వర్కవుట్ అవుతుందా?
ఇక మరో వైపు బన్నీ రాకా కోసం ముంబైలో ఉన్న సమయంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీక్రెట్ గా మీటింగ్ లో కూడా పాల్గొన్నాడని, 2034 ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుండే స్ట్రాటజీలు సిద్దం చేయాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.ఇక ఈయనకి మద్దతుగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బ్యాక్ ఎండ్ లో గ్రౌండ్ వర్క్ సిద్దం చేస్తున్నాడని మీడియాలో వినిపిస్తున్న టాక్ .ఇక ఈ చంద్రశేఖర్ రెడ్డి గతంలో BRS లో పని చేయగా ,ఇపుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారే.ఇక వినిపిస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో కాని అప్పడే పలు చానళ్ళు సీయం, అవుతాడా లేదా అంటూ ఏకంగా డిబేట్లు పెట్టేశాయి కూడా.
మెల్లిగా ఎంట్రీ ఇస్తాడా .. రాకుండా ఉంటాడా
అయితే ఇలా తెగ సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ ని ఖండించాడు బన్నీ పర్సనల్ మేనేజర్ శరత్ చంద్ర.అసలిందులో ఎలాంటి నిజం లేదని, కేవలం బన్నీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరింత ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతోనే ఇలా అభిమానుల సమావేశం ఉంటుంది తప్ప దీనికి పాలిటిక్స్ కి ఎలాంటి సంబంధం లేదని, బన్నీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం చేస్తున్న రాకా మీదనే ఉందని కుండబద్దలు కొట్టేశాడు.మొత్తానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్స్ కి ఇలా ఎండ్ కార్డ్ పడిందన్న మాట. చూడాలి మరి చాలా మందిలాగే అబ్బే రావట్లేదు అని మెల్లిగా ఎంట్రీ ఇస్తాడా ..లేక అన్న మాటకే కట్టుబడి రాకుండా ఉంటాడా ..కాలమే డిసైడ్ చేయాలి !
also read:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!