E-Paper
Advertisement

‘గాడ్ ఆఫ్ వార్’ కి ధనుష్ ‘తమిళ్ మురుగన్’ కౌంటరా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ మైథో వార్!

‘గాడ్ ఆఫ్ వార్’ కి ధనుష్ ‘తమిళ్ మురుగన్’ కౌంటరా? టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ మైథో వార్!
Advertisement

Murugan Controversy:సినిమా ఇండస్ట్రీలో ఒకే దేవుడి బ్యాక్‌డ్రాప్‌తో వేర్వేరు బాషలలో వేర్వేరుగా సినిమాలు రావడం మనం చూస్తునే ఉంటాం.శివుడు, వేంకటేశుడు, ఆంజనేయుడు వంటి దేవుళ్ళలపై ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు వచ్చి ఆడియన్స్ ని అలరించాయి కూడా.అయితే ఎప్పుడు లేనంతగా ఒక దేవుడు ఇపుడు రెండు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు. అతడే మురుగన్ (కార్తికేయుడు)..అవును ఇపుడు ఈయన చుట్టే తమిళ తెలుగు రాష్ట్రాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.కారణం ఏంటి అంటారా ?టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ ,గురూజీ త్రివిక్రమ్ కాంబోలో కార్తికేయ దేవుడి నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ రాబోతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది.

ధనుష్, వెట్రిమారన్ కలిసి ‘తమిళ్ మురుగన్’

Advertisement

ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆరా తీస్తుండగానే మేమూ మురుగన్ తో సినిమా తీస్తున్నామని బిగ్ అప్‌డేట్ వదిలింది కోలీవుడ్.నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ అయిన ధనుష్, వెట్రిమారన్ కలిసి ‘తమిళ్ మురుగన్’ అనే సినిమాని అనౌన్స్ చేస్తూ తాజాగా గ్లింప్స్ వదిలారు.వీరి కాంబోలో గతంలో ‘పొల్లాదవన్’ (2007), ‘ఆడుకాలం’ (2011), ‘వడ చెన్నై’ (2018), ‘అసురన్’ (2019) వంటి సినిమాలు కమర్షియల్‌గానే కాకుండా క్లాసిక్స్‌గా మంచి పేరుని తెచ్చుకున్నాయి.

also read:ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

Advertisement

ఇక ఇదే కాంబోలో ఐదో సినిమాగా లేటెస్ట్ గా వచ్చిన తమిళ్ మురుగన్’ గ్లింప్స్ ఇపుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.యుద్ధ భూమిలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక భారీ ఏనుగుపై వారియర్ లా కూర్చుని ఉన్న విజువల్స్ కి సాయి అభ్యంకర్ ఇచ్చిన బీజీఎం తోడు కావడంతో గూస్‌బంప్స్ వస్తున్నాయి. వండర్‌బార్ ఫిలింస్, ప్రొడక్షన్ మైల్స్ టు గో బ్యానర్లపై అరివుమతి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.అయితేఈ రెండు సినిమాల అనౌన్స్ మెంట్ వెనక కనిపించని ఒక యుద్దమే నడుస్తున్నట్టు తెలుస్తుంది.

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చాడన్న ఒక్క ట్వీట్ తో

అవును ..ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పోస్టర్ ఇలా వచ్చిందో లేదో తమిళ తంబీల నుండి నెగెటివ్ కామెంట్స్ పెరిగిపోయాయి.ముఖ్యంగా చిత్ర నిర్మాత నాగవంశీ తన ట్వీట్‌లో కార్తికేయుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చాడంటూ వేసిన ఒక్క ట్వీట్ తో వివాదం మరింత రాజుకున్న సంగతి తెల్సిందే. మురుగన్ వేల ఏళ్ల నుండి తమిళులకి ఆరాధ్య దైవమని అసలు మురుగన్ జన్మించిందే తమిళనాట అని అలాంటప్పుడు నార్త్ లో పుట్టినట్టు ఎలా ట్వీట్ చేస్తారంటూ మండి పడ్డారు తమిళ ప్రజలు.ఇక ఒకవైపు కాంట్రవర్సీ నడుస్తుండగానే ధనుష్ ‘‘ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు.. తమిళ్ మురుగన్’’ అంటూ క్యాప్షన్ తో సినిమా అనౌన్స్ చేయడం తో ఒక్కసారి గా టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ వార్ కి మరింత ఆజ్యం పోసినట్టయింది.

ఈ మురుగన్ వివాదం ఎటు వైపు వెళ్తుందో !

త్రివిక్రమ్ తెలుగులో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే యూనివర్సల్ టైటిల్ పెట్టగా ధనుష్ మాత్రం ‘తమిళ్ మురుగన్’ అని లోకల్ సెంటి మెంట్ అని అటాచ్ చేస్తూ టైటిల్ పెట్టడం చూస్తె తెలుగు సినిమాకి కౌంటర్ గానే తమిళతంబీలు ఇలా టైటిల్స్ పెట్టారా అన్న డౌట్స్ అవుతున్నాయి.నిజానికి కథల పరంగా వేర్వేరు నేపథ్యాలు అయినప్పటికీ నాగ వంశీ చేసిన ట్వీట్ వివాదం, ఆ తర్వాత ధనుష్ తమిళ్ అనే టైటిల్ యాడ్ చేస్తూ పెట్టడం ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చూడాలి మరి ఈ మురుగన్ వివాదం ముందు ముందు ఎటు వైపు వెళ్తుందో !

Related News

మళ్ళీ వెనక్కి వెళ్ళిన జననాయగన్ …వచ్చేది ఎప్పుడంటే ?

వామ్మో.. ఏంటీ అరాచకం.. ఒక్కో పోస్ట్ కి అన్ని లక్షలా.. శ్రీలీల డిమాండ్ మాములుగా లేదుగా?

భోగికి బోలెడు బడ్జెట్ కష్టాలు.. విభేదాలే కారణమా?

రక్త చరిత్ర -3 పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

బిచ్చగాడు ప్లస్ పోకిరి.. పూరి ఐడియా వర్కవుట్ అవుతుందా?

Big Stories

Advertisement
×