Puri Comeback:పూరి జగన్నాథ్ … ఒకప్పుడు తన పెన్ అనే గన్ తో వెండి తెరపై మాటల తూటాలు దించిన స్టార్ డైరెక్టర్.కాని ట్రెండ్ మారింది.ఇప్పటి వేగాన్ని అందుకోలేకపోతున్నాడా లేక పెన్ లో పస తగ్గిందా తెలీదు కాని టెంపర్ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పాడు. లోఫర్, ఇజం, రోగ్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయింది. పైసా వసూల్ పర్లేదనిపించినప్పటికీ పూరి – బాలయ్య కాంబోకి రావాల్సినంత అప్లాజ్ అయితే రాలేదు.
ఇక కొడుకుతో చేసిన మొహబూబా మటాష్ అవడంతో డీలా పడిపోయిన పూరికి కాస్త ఊపిరినిచ్చిన సినిమా ఇష్మార్ట్ శంకర్. ఉస్తాద్ అంటూ రామ్ ని ఊరమాస్ గా ప్రెజెంట్ చేయడంతో ఊగిపోయిన ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే అంటూ లైగర్, డబల్ ఇష్మార్ట్ సినిమాలతో లైమ్ లైట్ లో లేకుండా పోయాడు.
ఇంకా రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేయని స్లమ్ డాగ్
ముఖ్యంగా దేవరకొండతో తీసిన లైగర్ పూరిని అథాపాతాళానికి పడేసింది.నా లెక్క 200 కోట్ల నుండే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆకాశంలో కూర్చున్న రౌడీని ఈ సినిమా భూమి మీదకి తెచ్చింది.ఇక సినిమాలు మళ్ళీ ఎవరిస్తారు అని కాచుక్కూర్చున్న పూరికి విజయ్ సేతు పతి రూపంలో మంచి అవకాశం తలుపు తట్టింది.ఇక సినిమా కూడా చక చక పూర్తయి ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసింది.
also read:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో ఆపరేషన్.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ!
ఇక వదిలిన అప్ డేట్స్ చూస్తుంటే ఈ సినిమాని కూడా మాఫియాలో నే ముంచేసినట్టు కనిపిస్తుంది.ఇక ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కథని పోకిరి ప్లస్ బిచ్చగాడు అనే కాంబినేషన్ లో పూరి సిద్దం చేసినట్టు వినిపిస్తుంది.వినడానికి క్రేజీగానే ఉంది .కాని సినిమా పూర్తయి నెల్లాళ్ళు గడుస్తున్నా ఇంకా రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేసుకోకపోవడమే కాస్త విచిత్రం.
ఈ సినిమాతో అయినా సక్సెస్ కొడతాడో లేదో !
నిజానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో సినిమా పై ఉన్న హైప్ తగ్గకూడదు అంటే అప్ డేట్లతో సోషల్ మీడియాని షేక్ చేయాలి.కానీ అవేమీ పట్టనున్నట్టు స్లమ్ డాగ్ మాత్రం సైలెంట్ అయిపొయింది.సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా ఇప్పటికీ రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేయలేదో పూరికే తెలియాలి.
also read:వరుణ్ తేజ్ వైల్డెస్ట్ కంబ్యాక్ డేట్ ఫిక్స్…వరుస ప్లాపులకి బ్రేక్ పడేనా?
ఇక సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే సాలిడ్ గా ప్లాన్ వేశాడు పూరి.విజయ్ సేతుపతి తో పాటు, సంయుక్త మీనన్,దునియా విజయ్ విలన్‌గా, టబు కీలక పాత్రలు పోషిస్తున్నఈ సినిమాకి యానిమల్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. చూడాలి మరి ప్లాపులతో సావాసం చేస్తున్న పూరి ఈ సినిమాతో అయినా సక్సెస్ కొడతాడో లేదో !