BigTV English

TTD 2026 Calendars: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

TTD 2026 Calendars: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

TTD 2026 Calendars: తిరుమల శ్రీవారి భక్తులకు సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ వివరించింది.


2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.

ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా.. సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్నటీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.


అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.

టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికి.. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టీటీడీ డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది.

Also Read: దేశ చరిత్రలో ఏపీకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

టిటిడి క్యాలెండర్ లు, డైరీలను తిరుమల తిరుపతి(టీటీడీ) వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు.

Related News

Andhra Pradesh Investment: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

AP Weather Alert: ఏపీపై ద్రోణి ఎఫెక్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

AP Roads: రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రూ.1000 కోట్లు మంజూరు

Simhachalam Appanna: సింహాద్రి అప్పన్న ఆభరణాలు ఏమయ్యాయి.. ఏఈవో, ప్రధానార్చకులకు నోటీసులు

Nara Lokesh: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మాటనిలబెట్టుకున్న మంత్రి లోకేశ్!

Jagan Tour: జగన్‌ నర్సీపట్నం టూర్‌.. పోలీసులు పర్మీషన్.. వార్నింగ్‌తో వెళ్తారా? డ్రాపవుతారా?

YS Jagan: వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్

Big Stories

×