Hero Darshan : ఇండస్ట్రీలో పెను సంచలనానికి దారి తీసిన న్యూస్ హీరో దర్శన్ పోలీస్ కేసు.. ఆయన తన అభిమానిని హత్య చేసిన ఘటన పై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే కొద్దిరోజులు ఆయన జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ మీద ఆయనను రిలీజ్ చేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంచల విషయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో హీరో దర్శన్ ను పవిత్ర ను మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. బెంగుళూరు లోని ‘పరప్పన అగ్రహార జైలు’కి తరలించారు. దర్శన్ ఈ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి బళ్లారి జైలులో ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడి జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసారు.. ఈ మేరకు నిన్న దీనిపై కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి అతనికి ఉరిశిక్ష విధించండి అంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో సినిమాల సంగతి పక్కన పెడితే.. నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతూ ఉంటుంది. కన్నడ స్టార్స్ కొంతమంది వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ తో హాట్ టాపిక్ అయ్యింది. అభిమాని రేణుక స్వామీని హింసించి చంపించారని పోలీసులు హీరోను, ఆయన ప్రియురాలిని అరెస్ట్ చేశారు. చాలా రోజులుగా జైల్లో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇటీవలే ఆయన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో మళ్ళీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బళ్లారి జైలు నుంచి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే జైలుకు మార్చాలని అధికారులు కోర్టులో ఫిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరుపుతున్న సందర్బంలో ఓ వ్యక్తి ఉరి తియ్యాలని డిమాండ్ చేశారు. అది హీరోకు షాకిచ్చింది.
Also Read : మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?
కోర్టులోకి వచ్చిన అజ్ఞాత వ్యక్తితో జడ్జి మాట్లాడారు. ఆ వ్యక్తి తన పర్సనల్ విషయాలను అక్కడ వివరించారు.. ఆ వ్యక్తి అందించిన దరఖాస్తుని అంగీకరించలేనని జడ్జి అన్నారు. అయితే, అక్కడ కేసు ఏదైనా సరే.. ఆ వ్యక్తి పిటీషన్ కి దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్తానని అనడం గమనార్హం. ఈ కేసుకి సంబంధించిన అన్ని చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం జరగాలి. బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. దాంతో కోర్టులోకి వచ్చిన ఆ వ్యక్తి వెనుతిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అభిమాని హత్య కేసులో జూన్ 8 నుంచి దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. కేసు విచారణ త్వరలోనే పూర్తికానుందని సమాచారం. మరి హీరో దర్శన్ కు ఉరిశిక్ష విధిస్తారా? కొన్ని కండిషన్లు పెట్టి అతని రిలీజ్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఆయన అభిమానుల్లో తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది..