BigTV English

Tourists Free Flights: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!

Tourists Free Flights: ఈ దేశానికి వెళ్తే మీరు విమానాల్లో ఫ్రీగా తిరగొచ్చు.. చిల్లిగవ్వ కూడా చెల్లించక్కర్లేదు!

Free Flights:

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా తగిన చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే తమ దేశానికి వచ్చే పర్యాటకులకు పలు రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తాజాగా థాయ్ లాండ్ మరో అడుగు ముందుకు వేసి, అదిరిపోయే ఆఫర్ అనౌన్స్ చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా కొత్త ట్రావెల్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది ఈ స్కీమ్ లో భాగంగా దేశీయంగా ఉచిత విమాన ప్రయాణాన్ని కల్పించాలని భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా 2 లక్షల మందికి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించాలని నిర్ణయించింది.


ఇంతకీ ఏంటీ ఈ స్కీమ్..

ప్రతి ఏటా థాయ్ లాండ్ అందాలను తిలకించేందుకు పలు దేశాల నుంచి లక్షలాదిగా పర్యాటకులు తరలివస్తారు. వీరిలో ఎక్కువగా పుకెట్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్తున్నారు. దేశంలో ఇంకా పలు ప్రాంతాలు ఉన్నా, వాటికి చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలను కూడా చూసేలా ప్రోత్సహించేందుకు ఈ ఉచిత విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్‌’ పేరిట ఈ ఆఫర్‌ ను పరిచయం చేబోతోంది. ఇందులో భాగంగా దేశీయ విమానాల్లో ప్రయాణించే విదేశీ ప్రయాణీకులకు వన్ వే టికెట్ ధర 1,750 బాట్‌లు (రూ.4,700) , రౌండ్‌ ది ట్రిప్పు ప్రయాణానికి 3,500 బాట్‌లు (రూ.9,400) సబ్సిడీగా ఇవ్వనుంది.

త్వరలో కొత్త పథకం ప్రారంభం

ఇక ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ కు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ టికెట్స్ తీసుకున్న ప్రయాణీకులు ఎయిర్ లైన్ వెడ్ సైట్స్, మల్టీ సిటీ ఆప్షన్స్, ఫ్లై త్రూ సర్వీసెస్, ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్స్ నుంచి ఈ ఆఫర్ ను పొందవచ్చు. ప్రతి అంతర్జాతీయ ప్రయాణీకుడు రెండు దేశీయ విమాన టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. 20 కిలో వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు.  థాయిలాండ్‌ లో దేశీయ విమానాలను నడిపే అనేక విమానయాన సంస్థలు ఇప్పటికే ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు అంగీకరించాయి. వీటిలో బ్యాంకాక్ ఎయిర్‌ వేస్, నోక్ ఎయిర్, థాయ్ ఎయిర్ ఆసియా, థాయ్ ఎయిర్‌ వేస్, థాయ్ లయన్ ఎయిర్, థాయ్ వియట్‌ జెట్ ఉన్నాయి. ఈ విమానాలు చియాంగ్ మాయి, క్రాబీ బీచ్‌లు, సుఖోథాయ్‌ లోని  దేవాలయాలు సహా పలు ప్రాంతాలకు సర్వీసులను అందించనున్నాయి. ఈ పథకానికి $21.6 మిలియన్లు అవసరం అవుతాయని థాయ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ పథకం అమల్లోకి రానుంది.


థాయ్ లాండ్ ప్రజల ఆగ్రహం

ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ పర్యాటకులు స్వాగతిస్తుంటే, దేశీయ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఈ నిర్ణయం థాయ్ లాండ్ లోని ఇతర ప్రాంతాల పర్యాటకాన్ని పెంచడానికి, బ్యాంకాక్‌లో ఫుట్ ట్రాఫిక్‌ ను తగ్గించడానికి మంచి మార్గం” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.  “థాయ్ పౌరులు… పూర్తి ధర చెల్లించాల్సి ఉండగా, ఒక వారం పాటు సందర్శించే విదేశీ వ్యక్తులు ఉచిత విమానాలను ఎందుకు పొందాలి?” అని థాయ్ లాండ్ వాసులు ప్రశ్నిస్తున్నారు.

Read Also: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

 

Related News

No Passport – No Visa: ఇక వాళ్లు పాస్‌ పోర్ట్, వీసా లేకుండానే రావచ్చు.. భారత్ కీలక నిర్ణయం!

Flight Passenger: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

Bengaluru Woman Cop: యూకే వెళ్లే ఫ్లైట్ మిస్, పోలీసుకు రూ. 2 లక్షల జరిమానా!

IRCTC Tour Packages: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!

Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?

Big Stories

×