Vijay Thalapathi: కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathi)కి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ అభిమానులే ఆయనపై కేసు ఫైల్ చేయించడం సంచలనంగా మారింది. ముఖ్యంగా హీరోని కలవడానికి వెళితే దాడి చేశారు అని సదరు అభిమాని హీరోపై అలాగే ఆయన సిబ్బందిపై కేసు ఫైల్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విజయ్ ను చూడడానికి వచ్చిన అభిమానికి అవమానం..
కోలీవుడ్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి ఈ మధ్య టీవీకే పార్టీని కూడా స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ద్వారా వచ్చే ఎన్నికలలో తమిళనాడులో పోటీ చేసి అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలతో మమేకం అవ్వడానికి ఎప్పటికప్పుడు పలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య బహిరంగ సభలు నిర్వహించిన ఈయన.. ఇప్పుడు ప్రజలలోకి వెళ్తూ వారి మన్ననలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై కేసు ఫైల్ అవడం సంచలనంగా మారింది.
అభిమానిని తీసేసిన బౌన్సర్లు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 21వ తేదీన మధురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే ఒక అభిమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభించినప్పుడు వేదికపై విజయ్ నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ సమయంలో కొంతమంది యువకులు ఆయనను కలవాలని కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ నడుస్తున్న వేదిక పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే విజయ్ కి దగ్గరగా వచ్చిన శరత్ కుమార్ అనే వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్ అవతల పారవేసే ప్రయత్నం చేయగా.. అదృష్టవశాత్తు అతడు కింద పడలేదు. ఆ యువకుడు వేదికకు ఉన్న పైపును పట్టుకొని వేలాడి కిందకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీంతో మనస్థాతం చెందిన శరత్.. నటుడిని కలిసేందుకు వెళితే బౌన్సర్లు అడ్డుకోవడమే కాకుండా తోసే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేయడం జరిగింది.
విజయ్ పై పలు సెక్షన్స్ కింద కేస్ ఫైల్..
ఇదే విషయంపై అభిమాని శరత్ కుమార్ మాట్లాడుతూ..” నేను విజయ్ ను చూడడానికి వచ్చాను. కానీ వేదిక నుంచి నన్ను కిందకి తోసేశారు. నాకు గాయాలు కూడా అయ్యాయి. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాను” అంటూ తన తల్లితో సహా మీడియా ముందుకు వచ్చారు. ఫిర్యాదు ఆధారంగా విజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీ.ఎన్.ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ఒక అభిమాని కలవడానికి వస్తే అక్కడ బౌన్సర్లు చేసిన తీరుకి నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి విజయ్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
also read:Chiranjeevi: వినాయక చవితి స్పెషల్.. మన శంకర వరప్రసాద్ గెటప్ అదుర్స్!
த.வெ.க மாநாட்டில் தொண்டரை தூக்கி வீசிய பாதுகாவலர்கள்.. நடவடிக்கை எடுக்கக்கோரி கண்காணிப்பாளரிடம் புகார்.. த.வெ.க தொண்டர் வேதனை பேட்டி#TVKManaadu | #Vijay | #Police | #Complaint | #Bouncers pic.twitter.com/AKgg1vdrM3
— Polimer News (@polimernews) August 27, 2025