BigTV English

Chiranjeevi: వినాయక చవితి స్పెషల్.. మన శంకర వరప్రసాద్ గెటప్ అదుర్స్!

Chiranjeevi: వినాయక చవితి స్పెషల్.. మన శంకర వరప్రసాద్ గెటప్ అదుర్స్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆగస్టు 22వ తేదీన తన 70వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ నయనతార (Nayanthara ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు వినాయక చవితి పండుగ కావడంతో ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ఇంస్టాగ్రామ్ వేదికగా సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ రిలీజ్ చేశారు.


వినాయక చవితి స్పెషల్ పోస్టర్..

వినాయక చవితి సందర్భంగా అనిల్ రావిపూడి షేర్ చేసిన పోస్టర్ లో నదీ తీరాన పూలతో అందంగా డిజైన్ చేసిన బోట్ లో సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి.. మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చిన లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన పండుగ స్పెషల్ పోస్టర్ అంటూ అభిమానులు ఈ పోస్టును తెగ లైక్ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా ఇలా సాంప్రదాయ లుక్కులో చిరంజీవి గెటప్ చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


మన శంకర వరప్రసాద్ గారు..

ఈ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు. టైటిల్ రిలీజ్ లో భాగంగా విడుదల చేసిన ఈ వీడియోలో వెంకటేష్ వాయిస్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మన శంకర వరప్రసాద్ గారు పండుగకు వచ్చేస్తున్నారు అంటూ వెంకీ వాయిస్ తో వచ్చిన ఈ వీడియో బాగా అది ఆకట్టుకుందని చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికైతే చిరంజీవిని వింటేజ్ లుక్కులో చూపించబోతున్నారు అనిల్ రావిపూడి.

చిరంజీవి సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కొత్త మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ఏడుపదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

also read:Mowgli Glimpse: మోగ్లీ కోసం రంగంలోకి నాని.. ప్రేమ కథ అంటూ వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Related News

Daksha Teaser: పేరు మార్చుకున్న మంచు లక్ష్మి మూవీ… ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్.. రిలీజ్ అప్పుడే?

Film industry: కిడ్నాప్ కేసులో హీరోయిన్.. మరో ముగ్గురు అరెస్ట్!

Comedian Sudhakar: నెలరోజులుగా కోమాలో స్టార్ కమెడియన్.. కొడుకు ఏమన్నాడంటే ?

Vijay Thalapathi: అభిమానిపై దాడి… హీరో విజయ్ పై కేసు నమోదు

Yellamma: ఎల్లమ్మ.. మళ్లీ హీరో మారడమ్మా.

Big Stories

×