Watching Short Videos: చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు చాలా మంది స్మార్ట్ ఫోన్ బానిసలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్ వీడియోస్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎంత సేపు చూస్తున్నాం అనే సోయి లేకుండా పోతోంది. గంటలు క్షణాల్లో మాయమైపోతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో వీడియోలు స్క్రోల్ చేసే అలవాటు చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. మానసికంగానే కాకుండా, శారీరకంగానూ ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.
సోషల్ మీడియా వాడకంతో కలిగే సమస్యలు
సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుందంటున్నారు. దీని విడుదల ఎక్కువ కావడం వల్ల సోషల్ మీడియా బానిసలుగా మారే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఆందోళన, నిరాశ, నిద్రలేమి, ఆందోళన లాంటి ప్రతికూల మానసిక ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందంటున్నారు.
సోషల్ మీడియా రీల్స్ స్క్రోలింగ్‌కు కారణాలు
⦿ డోపమైన్ విడుదల: ప్రతి కొత్త నోటిఫికేషన్, ట్యాగ్, ఆకర్షణీయమైన కంటెంట్‌ను చూసినప్పుడు, మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ఆనందం మరియు కోరికను పెంచుతుంది.
⦿ అల్గోరిథమిక్ డిజైన్: సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు మీరు ఎంతసేపు అందులో గడుపుతారో, అంత ఎక్కువ కంటెంట్ ను మీకు చూపించడానికి రూపొందించబడ్డాయి.
⦿ తక్షణ వినోదం: సోషల్ మీడియా తక్షణ వినోదం, సమాచారం, కనెక్టివిటీని అందిస్తుంది. ఇది వినియోగదారులను ఆకర్షిస్తుంది.
సోషల్ మీడియా వాడకంతో ప్రతికూల పరిణామాలు
⦿ మానసిక ఆరోగ్యం: ఎక్కువగా సోషల్ మీడియా వాడకం వల్ల ఆందోళన, నిరాశ, మానసిక స్థితిలో మార్పులు, ఒత్తిడిని పెంచుతుంది.
⦿ నిద్రలేమి: ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
⦿ వ్యసనం: కొందరికి, సోషల్ మీడియా వ్యసనంగా మారుతుంది. ఇది వారి రోజువారీ పనుల పైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలు
⦿ సమయ పరిమితిని నిర్ణయించండి: సోషల్ మీడియాలో రోజుకు ఎంత సమయం గడపాలో నిర్ణయించుకోండి. రోజుకు రెండుసార్లు లేదంటే, అరగంట, గంట అని నిర్ణయం తీసుకోవాలి.
⦿ మీ ప్రవర్తనను గమనించండి: మీరు ఎందుకు ఫోన్ ని ఉపయోగిస్తున్నారు? ఫోన్ వాడకానికి గల కారణాలను గుర్తించాలి.
Read Also: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..
సోషల్ మీడియా వినియోగం గురించి న్యూరోసైన్స్ ఏం చెప్తుంది?
షార్ట్ ఫామ్ కంటెంట్ (రీల్స్, షార్ట్స్)ను ఎక్కువగా చూడటం వల్ల మెదడు ఆల్కహాల్ వాడకం కంటే 5 రెట్లు ఎక్కువగా దెబ్బతింటుందని న్యూరోసైన్స్ పరిశోధన వెల్లడించింది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, స్వీయ నియంత్రణను తగ్గిస్తుందని తెలిపింది. కాలక్రమేనా మెదడు మొద్దువారే అవకాశం ఉంటుందని వివరించింది. వీలైనంత వరకు సోషల్ మీడియాను పరిమితంగా వాడాలని సూచిస్తుంది.
Read Also: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!