Kalki 2:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా, ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కల్కి 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై చిన్న చిన్న అప్డేట్స్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సెట్ పైకి రాకుండానే ఊహించని ధరకు అమ్ముడుపోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా విడుదల అయ్యి రూ.1000 కోట్లు వసూలు చేస్తేనే రికార్డు. కానీ ఆ సినిమాకు సీక్వెల్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే వందల కోట్ల బిజినెస్ జరిగితే? ఇక ఆ రికార్డు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలోనే మొదటి భాగం సృష్టించిన సంచలనం సీక్వెల్ పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నైజాం ఏరియాలో ఈ చిత్రానికి భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగానికి రూ.1180 కోట్ల వరకు వసూళ్లు లభించాయి. ప్రభాస్ ను మరోసారి గ్లోబల్ స్టార్ గా నిలిపిన ఈ చిత్రం రెండో భాగంపై అంచనాలు పెంచేసింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సునీల్, సురేష్ బాబు సంయుక్తంగా రూ.108 కోట్లకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే నైజాం మార్కెట్లో ఇది రికార్డు స్థాయి డీల్ అని చెప్పవచ్చు. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
ఇకపోతే ఈ భారీ డీల్ రికవరబుల్ మోడల్ లో జరిగినట్లు సమాచారం. ఈ పద్ధతిలో సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయం ద్వారా బయ్యర్లు తమ పెట్టుబడిని రికవరీ చేసుకొనే అవకాశం ఉంటుంది. నా రికవరబుల్ అడ్వాన్స్ తో పోలిస్తే ఈ పద్ధతిలో బయ్యర్లకు కొంత భరోసా కూడా లభిస్తుందని చెప్పవచ్చు. నిర్మాతలకు ముందుగానే భారీ మొత్తం అందుతుంది .అందుకే ఈ డీల్ పై ట్రేడ్ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా మంచి వసూళ్లు సాధిస్తే బయ్యర్లకు సుమారుగా రూ.20 కోట్ల వరకు లాభం రావచ్చని అంచనా కూడా.. ఏది ఏమైనా విడుదలకు ముందే ఈ రేంజ్ లో భారీ డీలర్ కుదరడం నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలి.
also read:సింపథీ కార్డ్ ప్లే చేయకు..ఒక్కసారైనా గెలిచావా?వర్షిణిపై సృష్టి ఫైర్!
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నాగ్ అశ్విన్ ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదు. ఆయన ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కల్కి 2 పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 2027 మధ్య భాగంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక ఈ చిత్రాన్ని నిర్మించారు.