Teja Sajja : టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు పెళ్లిబాట పడుతున్నారు.. ఈమధ్య వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా హీరోలు, హీరోయిన్లు ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాళ్ళు కావాలని ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన స్నేహితురాలైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక నిన్న హీరోయిన్ మృణాలిని రవి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈ క్రమంలో హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా కూడా పెళ్లికి రెడీ అయ్యాడు. తాజాగా తేజా ఓ అమ్మాయితో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానులు తేజ చేసుకోబోతున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికిస్తున్నారు. మరి ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కో సినిమాతో తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ కుర్ర హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే తేజ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సైతం ఆత్రుత కనబరుస్తున్నారు. ఆమె పేరు మౌర్య.. ఈమెకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కే చెందిన ఈమె.. అమెరికాలో పెరిగింది. అమెరికాలో తన తండ్రికి సంబంధించిన ఒక ఐటీ కంపెనీ ఉండడంతో అందులోనే ఆమె ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీ బాధ్యతలను నిర్వర్తిస్తుందట. ఒక ఉద్యోగి అయ్యున్న ఆవిడ తేజకు ఎలా పరిచయమైంది? వీరిద్దరి పెళ్లి పెద్దలు కుదిరిచిన పెళ్లేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మరి ఈ వివరాల గురించి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. వీరిద్దరి పెళ్లి గురించి ఒక వార్త షికారు చేస్తుంది. తేజా సజ్జా కూడా వచ్చే నెలలోనే పెళ్లి చేసుకుంటాడా? లేదే వచ్చే ఏడాది కొత్త జీవితం ప్రారంభిస్తాడా అనేది చూడాలి..
చైల్డ్ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు స్టార్ హీరోలకు కొడుకుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తేజ హీరోగా నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ముఖ్యంగా హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాతో పాటుగా మిరాయ్ 2, జాంబీరెడ్డి 2 సినిమాల్లో నటిస్తున్నాడు.. వీటితో పాటుగా మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.