E-Paper
Advertisement

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Baby Nakshatra:హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ(Raviteja ) ఎట్టకేలకు ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో జానర్ మార్చి చేసిన చిత్రం ఇరుముడి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా, ఫ్యామిలీ ఎమోషనల్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇకపోతే టాక్సిక్ సినిమా కారణంగా సుమారుగా ఒక్క తెలంగాణలోనే 120 కి పైగా థియేటర్ల నుండి ఈ సినిమాను తొలగించినా.. మిగతా థియేటర్లలో మాత్రం హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ భారీగానే రాబడుతోంది.

బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్..

ఇకపోతే ఈ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో రవితేజ కూతురిగా మణెమ్మ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది. ధైర్యం కలిగిన ఆడపిల్లగా.. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన నక్షత్ర.. ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న బేబీ నక్షత్ర.. ఈ సినిమా కోసం అక్షరాల రూ.10 లక్షలు తీసుకుందట. మొదటి సినిమాతోనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే.. ఇక ఆమె నటనా ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక పాప టాలెంటుని ఆ పాత్రకు ఉన్న లోతును బట్టి ఆమెకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రీల్స్ ద్వారా సినిమాల్లో అవకాశం..

Advertisement

బేబీ నక్షత్ర ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మలయాల కుట్టి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమెను.. ఈమె టాలెంట్ ని చూసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్టుగా ఈమె తల్లిని సంప్రదించారట. పాప టాలెంట్ కు తగ్గ అవకాశం లభించడంతో ఆమె తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అందుకే ఇరుముడిలో తనకు మొదటి అవకాశం లభించిందని బేబీ నక్షత్ర స్వయంగా తెలిపింది.

also read:నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!

బేబీ నక్షత్ర నటనపై కోలీవుడ్ స్టార్ ప్రశంసలు..

Advertisement

ఇకపోతే ఈ సినిమాలో బేబీ నక్షత్ర కనపరిచిన అత్యుత్తమ ప్రతిభకు పలువురు సెలబ్రిటీలు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఈమెకు వీడియో కాల్ ద్వారా నటన నేర్పించమని అడిగిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే సూపర్ స్టార్లను కూడా మెప్పించి.. ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది బేబీ నక్షత్ర.

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×