E-Paper
Advertisement

నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!

నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!
Advertisement

Kriti Sanon:ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే.. ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. వేసుకునే దుస్తులను మొదలుకొని మాట్లాడే మాటల వరకు ప్రతిదీ కూడా సెలబ్రిటీలు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏదైనా కాస్త తేడా వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కృతి సనన్ (Kriti Sanon) రాఖీ పండుగ సందర్భంగా ఒక జువెలరీ యాడ్ ప్రకటనలో నటించింది . అయితే అందులో కుక్కకు రాఖీ కట్టడమే కాకుండా ఐవరీ కలర్ బ్రాలెట్ బ్లౌజ్ ను ధరించడంతో సోషల్ మీడియాలో ఈమెపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా కంగనా రనౌత్ (Kangana Ranaut) లాంటి సెలబ్రిటీలు కూడా దారుణంగా విమర్శించారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్.. యాడ్ వీడియో డిలీట్ చేసిన ప్రకటన సంస్థ..

అలా ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు “ఇండియన్ కల్చర్ సాంప్రదాయాలు , పండుగల పట్ల తమకు పూర్తి గౌరవం ఉంది. కుటుంబంతోపాటు పెంపుడు జంతువుల పై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త యాడ్ రూపొందించాము. అయితే ఈ యాడ్ కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు కోరుతూ యాడ్ ను తొలగిస్తున్నాం” అంటూ అధికారికంగా వెల్లడించింది మొత్తానికైతే నెటిజన్స్ దెబ్బకు కృతి సనన్ వీడియో డిలీట్ చేయడం జరిగింది ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పందించిన హీరోయిన్..

Advertisement

ముఖ్యంగా ఈ యాడ్ లో కుక్కకు రాఖీ కట్టడం, రాఖీ కట్టేటప్పుడు అలాంటి దుస్తులు ధరించడం సరైనదేనా? హిందూ సాంప్రదాయాలను కృతి అవమానించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలు అంటే ఎందుకు అంత చులకన అంటూ ఆమెను నిలదీశారు. ఇకపోతే తనపై వస్తున్న వార్తలకు ఆమె స్పందించింది. సాంప్రదాయాలను గౌరవించే విధానం, మన దుస్తులపై ఆధారపడి ఉండదు. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో కాదు ఆమె మనసుకు సంబంధించిన విషయం.. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకా ఎప్పుడు ఆపుతారు.. టెక్నాలజీ మారుతోంది.. కనీసం ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ఇక కుక్కకు రాఖీ కట్టడం అంటారా కుక్క కూడా మా కుటుంబంలో ఒక వ్యక్తి అందుకే రాఖీ కట్టాను” అంటూ ఆమె వెల్లడించింది.

also read:టాక్సిక్ టాక్.. డిజిటల్ రైట్స్ పై భారీ ఎఫెక్ట్.. నిర్మాతల రియాక్షన్?

కృతి సనన్ కెరియర్..

Advertisement

కృతి సనన్ విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసిన ఈమె.. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు ఇలా ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొంది.ఏది ఏమైనా కృతి సనన్ ఈ రకంగా మరోసారి వార్తల్లో నిలవడం.

Related News

పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

ప్రెగ్నెన్సీ లో కూడా తగ్గేదేలే.. సమంత డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా!

టాక్సిక్ దెబ్బకి దిల్ రాజు విలవిల?

ధురంధర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన టాక్సిక్!

మాధురి రాథోడ్ కు సపోర్ట్ గా హైపర్ ఆది.. ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్..

వారణాసి కోసం సందీప్ కీలక నిర్ణయం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

స్టార్ హీరోల సినిమాలకు అదే మైనస్.. కక్కుర్తి పడితే ఇదే జరిగేది..?

Big Stories

Advertisement
×