Coolie & War 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆడియన్ థియేటర్ కు వచ్చే సినిమా చూడటం అనేది సాహసం అయిపోయింది. చాలామంది నిర్మాతలు కూడా అతి తక్కువ డబ్బులకి మూడు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని అంటున్నారు. కానీ ఒక టికెట్ కోసం ఆడియన్ పెట్టే 300 రూపాయలతో ఒక మధ్య తరగతి ఫ్యామిలీ మూడు రోజులు బతుకుద్ది అని చెప్పొచ్చు.
కానీ సినిమాల మీద విపరీతమైన ఇష్టం ఉండటం వలన కొంతమంది ఇప్పటికీ థియేటర్ కి వచ్చి సినిమాలు చూసే ప్రయత్నం చేస్తుంటారు. దానికి తోడు పెద్ద సినిమాకి మాత్రమే థియేటర్ కు రావడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డు చూడడం అనేది గగనం అయిపోయింది. చాలా టౌన్సులో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కి 50,60 మంది మాత్రమే కనిపించిన దాఖలాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో షో స్ క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో టిక్కెట్ రేట్ హైక్ లేదు
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో తెలుసు కాబట్టి దానిని క్యాష్ చేసుకుందామని టికెట్లు రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా కొద్దిపాటి క్లారిటీ వచ్చినట్లు ఉంది. అందుకని తెలంగాణలో కూలీ మరియు వార్ 2 సినిమాలకు సంబంధించి టికెట్ హైక్ లేదు అన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. తెలుగు సినిమా బానిసలు అని కొంతమంది మామూలుగా మాట్లాడుకునే మాటలను, వీళ్ళు నిజం చేసేలా అనిపిస్తుంది.
ఇది ఒక శుభ పరిణామం
సినిమా బాగుంటే టిక్కెట్ రేట్లు తక్కువ ఉన్నా కూడా రావాల్సిన కలెక్షన్లు వస్తాయి. థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇలా ప్రేక్షకులు సంఖ్య పెరిగినప్పుడు థియేటర్లు కళకళలాడుతాయి. మళ్లీ సినిమాలకు పూర్వ వైభవం వస్తుంది. ఇలా ప్రేక్షకుడిని మళ్లీ థియేటర్ వరకు తీసుకురావడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు జరగాలి. టికెట్ రేటు దగ్గర నుంచి, అలానే హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు తమ నుంచి వచ్చేలా ప్లాన్ చేస్తే థియేటర్ ను సందర్శించడానికి ఆడియన్ ఇష్టపడతాడు. రెండేళ్లకి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఆడియన్. ఆ రెండేళ్ల తర్వాత వచ్చే సినిమా టిక్కెట్ రేటు కూడా చూసి థియేటర్కు వెళ్ళను పరిస్థితి ఉంది. మొత్తానికి టిక్కెట్ రేట్ హైక్ లేకపోవడం అనేది ఒక శుభ పరిణామనే చెప్పాలి.
Also Read : వెంకటేష్ మహా, Rao Bahadur : సత్యదేవ్ మరోవైవిద్యమైన ప్రాజెక్ట్, బ్రేక్ వస్తుందా?