World’s Most Expensive Bike: సాధారణంగా బైక్ కొనాలంటే వేల రూపాయులు ఖర్చు చేస్తాం. మరికొందరు లక్షల్లో ఖర్చు చేస్తారు. ఇంకొందరు ఖరీదైన లగ్జరీ బైకుల కోసం కోట్లు వెచ్చిస్తారు. కానీ, ఒక బైక్ ధర ఏకంగా రూ.91 కోట్లకు పైగా ఉంటే నమ్మగలరా? అవును.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ లలో ఒకటైన నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ (Neiman Marcus Limited Edition Fighter) ధర అక్షరాలా రూ. 90 కోట్లకు పైమాటే. అసలు ఈ బైక్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇంత ధర పలకడానికి కారణమేంటి? అంటే..
నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బైకుల లిస్టులో టాప్ లో ఉంటుంది. దీని ధర సుమారు 11 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో లెక్కిస్తే దాదాపు రూ.91 కోట్లకు పైమాటే. సాధారణంగా ఈ మొత్తంతో ఎన్నో లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ బైక్ ధర మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఈ బైక్ ఇంత ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం దీని పరిమిత తయారీ. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 45 యూనిట్లనే తయారు చేశారు. అంటే.. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకున్నా అందరికీ అందుబాటులో ఉండదు. చాలా తక్కువ సంఖ్యలో తయారు చేయడంతో కలెక్టర్లకు కూడా ఇది అత్యంత విలువైన మోడల్‌గా మారింది.
ధర, అరుదైన ఉత్పత్తి మాత్రమే కాదు.. దీని పనితీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ బైక్ గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. దీని డిజైన్ కూడా సాధారణ బైక్ లతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకమైన బాడీ నిర్మాణం, ఆకర్షణీయమైన రూపం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్‌ను కేవలం ప్రయాణం కోసం ఉపయోగించే బైక్‌గా చూడలేం. అత్యంత అరుదైన మోడల్ కావడం, ప్రత్యేకమైన డిజైన్, భారీ ధర లాంటి అంశాలు దీనిని విలువైన కలెక్షన్ వస్తువుగా నిలబెట్టాయి. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన బైకుల గురించి చర్చ వచ్చినప్పుడు ఈ మోడల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రూ.91 కోట్లకు పైగా ధర, కేవలం 45 యూనిట్ల ఉత్పత్తి, గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగం.. ఈ మూడు అంశాలే నీమాన్ మార్కస్ ఫైటర్‌ను ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన బైకుల్లో ఒకటిగా నిలబెట్టాయి.
Read Also: ఒకేసారి స్కూటర్, బైక్‌కు పేటెంట్లు.. విన్‌ఫాస్ట్ ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!