E-Paper
Advertisement

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్
Advertisement

Spy Comedy Thriller: రొటీన్ గూఢచారి సినిమాలలా కాకుండా, ఒకవైపు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, మరోవైపు కడుపుబ్బా నవ్వించే క్రేజీ కామెడీ టైమింగ్ రెండూ బ్లెండ్ అయితే ఆ కిక్కే వేరు. సరిగ్గా అలాంటి ఒక ఫ్రెష్ అండ్ ఎనర్జిటిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘వైబ్’ (Vibe). ప్రస్తుతం ఈ హిందీ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో) లో అఫీషియల్ గా స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కునాల్ కెమ్ము, ప్రీతి జింటా, స్పర్శ్ శ్రీవాస్తవ, వంశికా ధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగులో ఉందా ? కథ ఏమిటి ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే..

బాధ్యతలు లేకుండా సరదాగా తిరిగే హార్దిక్ (కునాల్ కెమ్ము), అతని ప్రాణస్నేహితుడు బగ్స్ (స్పర్శ్ శ్రీవాస్తవ) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బగ్స్ తన బాస్‌ను ఒప్పించి హార్దిక్‌కు తన ఆఫీసులోనే ఉద్యోగం ఇప్పిస్తాడు. అక్కడ హార్దిక్ కొత్తగా చేరిన కరీనా (వంశికా ధీర్) అనే ఇంటర్న్‌తో ప్రేమలో పడతాడు. కరీనాతో డేట్‌కు వెళ్లిన తర్వాత హార్దిక్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉందనే అనుమానంతో భారత రహస్య ఏజెంట్లు హార్దిక్‌ను అదుపులోకి తీసుకుంటారు.

Advertisement

కరీనా అసలు పేరు హుమా సయీద్ అని, ఆమె తండ్రి, సోదరుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మేడమ్ హెచ్ (ప్రీతి జింటా) గుర్తిస్తుంది. ఇక తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి మేడమ్ హెచ్ హార్దిక్‌కు ఒక అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో ఎటువంటి గూఢచారి శిక్షణ లేని సాధారణ యువకులైన హార్దిక్, బగ్స్ కలిసి ఒక ప్రమాదకరమైన రహస్య ఆపరేషన్‌లో భాగమవుతారు. అనేక హాస్యభరితమైన, ఉత్కంఠభరితమైన పరిస్థితులను దాటుకుని, వీరిద్దరూ కలిసి ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి దేశాన్ని ఎలా కాపాడారనేదే మిగతా కథ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

వైబ్ (Vibe) సినిమా 2026 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ చిత్రం 2026 నవంబర్ 13 నుండి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒరిజినల్ హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ ఆడియో ఆప్షన్స్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది. కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతనే ప్రధాన పాత్రధారి హార్దిక్‌గా నటించగా, ప్రీతి జింటా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మేడమ్ హెచ్‌గా కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు స్పర్శ్ శ్రీవాస్తవ, వంశికా ధీర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Advertisement

Read Also: ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

Related News

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ

Big Stories

Advertisement
×