E-Paper
Advertisement

52 టన్నులు.. రూ.72 వేల కోట్ల వ్యాపారం.. ఈ బంగారం క్రేజ్‌కు రీజన్స్ ఇవే!

52 టన్నులు.. రూ.72 వేల కోట్ల వ్యాపారం.. ఈ బంగారం క్రేజ్‌కు రీజన్స్ ఇవే!
Advertisement

India Gold Sales: 2023లో 10 గ్రాముల బంగారం ధర 60 వేలు. 2025 నాటికి అదే బంగారం ధర లక్షా 15 వేలు దాటింది. ఇక ఈ ఏడాది ఒక దశలో లక్షా 80 వేల రికార్డు స్థాయిని కూడా తాకింది. ధరలు ఇలా భారీగా పెరిగి.. కాస్త తగ్గినా.. బంగారం కొనుగోళ్లపై మన ఇండియన్స్ ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గడం లేదు. ధంతేరాస్, దీపావళి సీజన్‌లో గతేడాదితో పోలిస్తే బంగారం అమ్మకాలు ఏకంగా 30 శాతం పెరిగాయి. ఏకంగా 52 టన్నుల బంగారం అమ్ముడవగా.. దాని విలువ అక్షరాలా రూ.72 వేల కోట్లు. అసలు ఇంత భారీ ధరల మధ్య కూడా బంగారం కొనుగోళ్లు ఎందుకు పెరిగాయి? ధరలు తగ్గడం ఒక్కటే కారణమా? లేక భారతీయుల బంగారంపై ఉన్న సెంటిమెంట్ కూడా దీనికి కారణమా?

దీపావళి, ధంతేరాస్‌లో అమ్ముడైన బంగారం

Advertisement

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ రీసెంట్‌గా కొన్ని లెక్కలు రిలీజ్ చేసింది. ఈ ఏడాది ధంతేరాస్, దీపావళి పండగల టైమ్‌లో దేశవ్యాప్తంగా ఏకంగా 52 టన్నుల బంగారం అమ్ముడైంది. దీని విలువ అక్షరాలా 72 వేల కోట్లు. గతేడాదితో పోలిస్తే కొనుగోళ్ల పరిమాణం 30 శాతం పెరిగింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. బంగారం మాత్రమే కాదు, వెండి కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వెండి అమ్మకాలు 10 శాతం పెరిగి 300 టన్నులకు చేరాయి. వీటి విలువ సుమారు 5 వేల 400 కోట్లు. అంటే ఒక్క ధంతేరాస్, దీపావళి సీజన్‌లోనే బంగారం, వెండి కలిపి దాదాపు 77 వేల 400 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఇది కేవలం షాపింగ్ కాదు.. భారతీయ కుటుంబాల్లో బంగారం, వెండికి ఉన్న క్రేజ్‌ ఇది.

భారీగా కొనుగోళ్లు పెరగడానికి కారణమేంటి?

Advertisement

అయితే ఇంత భారీగా కొనుగోళ్లు పెరగడానికి అసలు కారణమేంటి? దీనికి మెయిన్‌గా కనిపిస్తున్న రీజన్‌ బంగారం ధరల్లో వచ్చిన భారీ కరెక్షన్. ఈ ఏడాది ఒక దశలో 10 గ్రాముల బంగారం ధర లక్షా 80 వేల రికార్డు స్థాయికి చేరింది. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ సుమారు లక్షా 40 వేల స్థాయికి వచ్చింది. అంటే 10 గ్రాములపై దాదాపు 38 వేలు తగ్గింది. అంటే 21 శాతం ధర తగ్గింది. ఈ తగ్గుదలను చూసి బంగారం కొనాలనే జోష్‌ను పెంచింది. గతంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని కొనుగోళ్లు వాయిదా వేసుకున్నవాళ్లు.. ఇప్పుడు ధరలు కొంత దిగిరావడంతో మళ్లీ జువెలరీ షాపుల బాట పట్టారు. అంటే బంగారం కొనాలనే ఆసక్తి ఎవరికి తగ్గలేదు. ధరలు అందుబాటులోకి వస్తాయేమోనని చాలా రోజులుగా ఎదురు చూశారని మనం అర్థం చేసుకోవాలి.

ఈ అమ్మకాల జోరుకు ఇంకొన్ని రీజన్స్..

ఈ అమ్మకాల జోరుకు ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. నవంబర్ మధ్య నుంచి దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతుంది. భారతీయ కుటుంబాల్లో పెళ్లంటే బంగారు నగలు తప్పనిసరి. అందుకే పెళ్లిళ్ల కోసం చాలామంది ముందుగానే ఆభరణాలు కొనుగోలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే… ఈసారి పండగలు నెల ప్రారంభంలోనే వచ్చాయి. అప్పటికే ఉద్యోగులకు నెలవారీ జీతాలు, పండగ బోనస్‌లు చేతికి అందాయి. ఓ వైపు కొనాలనే ఆశ ఉంది.. అవసరం ఉంది.. చేతిలో డబ్బు కూడా ఉంది. ఇక మనవాళ్లు ఆగుతారా?

పండగలు, పెళ్లిళ్ల సీజన్ జోరు

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ వరకు చూస్తే బంగారం అమ్మకాలు లాస్ట్‌ ఇయర్‌తో పోలిస్తే.. దాదాపు 50 శాతం పడిపోయింది. అధిక ధరలు, ఇంపోర్ట్‌ టారిఫ్‌ పెరుగుదల, బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తి.. ఇవన్నీ కొనుగోళ్లపై ప్రభావం చూపాయి. కానీ పండగ సీజన్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ధరల్లో వచ్చిన తగ్గుదలతో పాటు సంప్రదాయ కొనుగోళ్లు, పెళ్లిళ్ల అవసరాలు మళ్లీ మార్కెట్‌లో మరోసారి జోష్ నింపాయి.

ధరల మోత మోగినా.. తగ్గేదేలే

అంటే మన వాళ్లకు ధర పెరిగినా.. తగ్గినా.. బంగారంపై మోజు మాత్రం తగ్గదు. జస్ట్‌ కరెక్ట్‌ టైమ్‌ కోసం వెయిట్ చేస్తారంతే. 2023లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 60 వేలు ఉండేది. ఎగబడి కొనేశారు. 2024లో అది 80 వేలకి చేరింది.. అయినా తగ్గేదేలే అన్నారు. 2025 నాటికి 1.15 లక్షల నుంచి 1.20 లక్షల మధ్యకు వెళ్లింది. ఇప్పుడు కాస్త తగ్గడమే బెటర్ అనుకున్నారు. మధ్యలో ఒకసారి లక్షా 80 వేలను టచ్ చేసింది.. ఇప్పుడు వద్దులే అనుకున్నారు. మళ్లీ 2026లో పండగ సీజన్ నాటికి లక్షా 42 వేలకి చేరింది. మళ్లీ ఎగబడి కొనేశారు. ఓవరాల్‌గా చూస్తే.. అంటే మూడేళ్లలోనే బంగారం ధర రెట్టింపునకు పైగా పెరిగింది. కానీ ఇప్పుడు కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు.

బంగారం లోహం కాదు.. ఒక సెంటిమెంట్!

ఈసారి పండగ సీజన్‌లో బంగారం అమ్మకాల పరిమాణం గత పదేళ్ల అమ్మకాలతో కంపేర్ చేస్తే.. మూడో అత్యధిక స్థాయిలో నమోదైంది. ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు 10 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ స్థాయి డిమాండ్ కనిపించడం విశేషం. ఇక్కడ లాజిక్ ఏంటంటే.. లక్షా 20 వేలు ఉన్నప్పుడు కాస్త తగ్గిన అమ్మకాలు.. లక్షా 80 వేలను తాకి కాస్త తగ్గేసరికి.. తగ్గింది కదా అని కొనేశారు. అందుకే అంటారు.. బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది ఒక సంప్రదాయం. ఒక సెంటిమెంట్. ఒక ఆర్థిక భరోసా. పిల్లలు పుట్టినా బంగారం కొనాలి. పెళ్లిళ్లు జరిగినా బంగారం కావాలి. పండగ వచ్చినా బంగారం కొనాలి. ఇంట్లో శుభకార్యం జరిగినా కొనాల్సిందే.

ఎగబడి బంగారం కొనేసిన ఇండియన్స్!

మొత్తానికి ఈ ఏడాది ధంతేరాస్, దీపావళి అమ్మకాల లెక్కలు ఒక విషయంపై క్లారిటీ మాత్రం ఇస్తున్నాయి. బంగారం ధరలు పెరిగితే భారతీయులు కొంతకాలం ఆగుతారేమో కానీ.. బంగారంపై తమ అభిమానాన్ని మాత్రం అస్సలు వదులుకోరు.

Also Read: వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

Tags

Related News

కోడిగుడ్లు, చికెన్ ధరలు తగ్గనున్నాయా? కారణం ఇదే

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

Big Stories

Advertisement
×