BigTV English

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Chiranjeevi: అభిమానులు లేనిదే హీరోలు లేరు.. ఇది సత్యం. అలాగే అభిమానులను ప్రేమించని హీరోలు కూడా లేరు. అందులో మెగాస్టార్ చిరంజీవి అయితే తన అభిమానులే తన కుటుంబం అన్నట్లు ఉంటాడు. వారికోసం ఏదైనా చేస్తాడు. అందుకే అభిమానులు ఆయన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. తమ అభిమాన హీరోను చూడడానికి ఎంతోమంది సైకిల్ యాత్రలు చేస్తూ.. ఉన్నవారిని, కుటుంబాన్ని వదిలేసి సాహసాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు పురుషులు.. సైకిల్ యాత్రలు చేస్తూ హీరోలను కలిసిన సందర్బాలు చూసాం. కానీ, మొదటిసారి ఒక మహిళ తన అభిమాని హీరో మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి సైకిల్ యాత్ర చేసింది.


ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరికి మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానం. జీవితంలో ఒక్కసారైనా ఆయనను కలవాలని ఎంతో ఆశపడింది. ఇంట్లో కూర్చుంటే ఆ కల.. కలగానే ఉండిపోతుందని భావించి పెద్ద సాహసానికే ఒడిగట్టింది. మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు ప్రయాణమైంది. ఎన్నో ఆటంకాలను, సవాళ్ళను ఎదురైనా తట్టుకొని నిలబడి హైదరాబాద్ కు చేరుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరు.. చలించిపోయాడు. తనకోసం మహిళా అభిమాని ఇంత సాహసం చేసిందని తెలుసుకొని ఆమెను హృదయపుర్వకంగా ఇంటికి ఆహ్వానించాడు.

ఇక మెగాస్టార్ ను కలిసిన రాజేశ్వరి ప్రేమతో ఆయనకు రాఖీ కట్టి.. చిరు ఆశీస్సులు అందుకుంది. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఎంతో అందమైన పట్టుచీరను ఆమెకు బహుమతిగా అందించాడు. అంతేకాకుండా రాజేశ్వరి ఇద్దరు పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా  ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చాడు.  ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ చిరు గొప్ప మనసును మరోసారి ప్రశంసిస్తున్నారు. అభిమానుల బిడ్డల భవిష్యత్తు గురించి ఇంత గొప్పగా ఆలోచించడం మెగాస్టార్ కే సాధ్యమని చెప్పుకొస్తున్నారు.


ఇక చిరు కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తున్నాడు చిరు. విశ్వంభర షూటింగ్ ఫినిష్ చేసుకొంటుంది. దీంతో పాటే మన శంకర వరప్రసాద్ కూడా షూటింగ్ ఫినిష్ చేసుకొని సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ రెండు కాకుండా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందించిన బాబీతో చిరు మెగా 158 ని అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ!

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా ?

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Big Stories

×