Flipkart Offers: ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ 2025 ను ప్రారంభించింది. ఈ సేల్‌లో దేశవ్యాప్తంగా ప్రముఖ మొబైల్ బ్రాండ్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సామ్ సంగ్, వీవో, మోట్రొలా, నథింగ్, ఒప్పో వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఎంఆర్పీ కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, కూపన్ డిస్కౌంట్లు, అలాగే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం వంటి అదనపు సదుపాయాలను కూడా అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 విజయవంతంగా ముగియడంతో, ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ల పై భారీ తగ్గింపులు అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. తక్కువ ధరలో మంచి ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఇది వినియోగదారులకు ఒక గొప్ప అవకాశం. ఈ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ ముగియడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి, వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ఉపయోగించి పెద్ద సంఖ్యలో ఫోన్లను ఆర్డర్ చేస్తున్నారు. ఈ సేల్ ముగిసిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ మళ్లీ దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో మాత్రమే ప్రత్యేక ఆఫర్లు అందించనుంది.
Also Read: Apple – Samsung: స్మార్ట్ ఫోన్ కంపెనీకి యాపిల్, సామ్‌సంగ్ లీగల్ నోటీసులు.. ఏం జరిగింది?
ముఖ్య ఫోన్ మోడల్స్, తగ్గింపు ధరలు:
Samsung Galaxy S24 128GB: అసలు ధర రూ.74,999 → ఆఫర్ ధర రూ.46,999
Nothing Phone 3a 128GB: అసలు ధర రూ.27,999 → ఆఫర్ ధర రూ.22,999
Motorola Edge 60 Fusion 5G 256GB: అసలు ధర రూ.25,999 → ఆఫర్ ధర రూ.20,999
Vivo T4 5G 128GB: అసలు ధర రూ.25,999 → ఆఫర్ ధర రూ.19,999
CMF Phone 2 Pro 128GB: అసలు ధర రూ.22,999 → ఆఫర్ ధర రూ.16,999
Motorola Edge 50 Fusion 128GB: అసలు ధర రూ.25,999 → ఆఫర్ ధర రూ.17,999
Oppo K13 5G 128GB: అసలు ధర రూ.22,999 → ఆఫర్ ధర రూ.16,499
Vivo T4x 5G: అసలు ధర రూ.17,999 → ఆఫర్ ధర రూ.13,499
ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా కలిపి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి, హైఎండ్ ఫోన్ల నుంచి బడ్జెట్ ఫోన్ల వరకు వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత తగ్గింపులు వినియోగదారుల ఖర్చును ఎక్కువగా తగ్గిస్తాయి. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ సేల్‌ను తప్పకుండా ఉపయోగపడుతుంది.