Telugu Film Industry : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్న పెద్దమనుషులు చాలామంది ఉన్నారు. కానీ పెద్ద మనసున్న మనుషులు చాలా తక్కువ. ఆ తక్కువలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటారు. ఏ రోజు ఇండస్ట్రీలో తాను పెద్దమనిషి అని చెప్పుకోలేదు. కానీ ఇండస్ట్రీ ముందుకు అడుగులు వేయడం ఆగిపోయినప్పుడు నేనున్నాను అంటూ ముందుకు వస్తారు మెగాస్టార్. కేవలం ముందుకు రావడమే కాకుండా ముందుకు నడిపిస్తారు కూడా. అందుకే మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఎవరు అందుకోలేని ఒక శిఖరమే.
సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) గారి చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే మనుషులు లేరు అని చాలామంది చెబుతుంటారు. అలా లేరు అని అందరూ ఊహించే టైంలో ముందుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు మెగాస్టార్. కానీ ఆయన తర్వాత స్థానం నాదే అని చెప్పుకోరు. మీరే పెద్దమనిషి అంటే ఒప్పుకోరు. కానీ పరిష్కారం మాత్రం చూపిస్తారు.
ఎన్నో ఉదాహరణలు
మెగాస్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమకు సేవ చేయడమే కాకుండా సమాజానికి కూడా సేవ చేశారు. ఇంకా గొప్పగా సేవ చేద్దామని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. కానీ అవతల వాళ్ళ కోసం నిలబడాలి అని మనసు మార్చుకోలేకపోయారు. కుడిచేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. చిరంజీవి అచ్చం అలాంటి మనిషి. సాయం పొందుకున్న వాళ్ళు చెబితే గాని చిరంజీవి సాయం చేసినట్లు తెలియదు. దీనికి ఉదాహరణగా పొన్నంబలం (Ponnambalam) విషయం చెప్పొచ్చు. చాలామంది వాళ్లు సందర్భాలలో మెగాస్టార్ చేసిన సాయాన్ని చెప్పుకొచ్చారు.
సినిమా కార్మికుల, నిర్మాతలకు క్లారిటీ
గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా కార్మికులకు నిర్మాతలకు మధ్య ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఇది చిరంజీవి నాకు సంబంధం లేని విషయం అని పక్కకు తప్పుకోవచ్చు. కానీ అలా చేయలేదు. గత రెండు రోజులుగా ఒకవైపు ఫెడరేషన్ సభ్యులతోనూ, మరోవైపు నిర్మాతలతోనూ చర్చలు కొనసాగిస్తూ వాళ్ల ప్రతి ఒక్కరి దృక్కోణాన్ని వింటూనే వచ్చారు.
దీనిని బట్టి ఇరువర్గాలు ఆమోదం పొందేలా ఒక సరైన నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి చెప్పి ఈ సమ్మెను స్టాప్ చేయగలరు. ప్రస్తుతం అది చేయగలిగే స్థాయి మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకులను ఇరువర్గాలు వెళ్లి కలిసిన కూడా చేస్తాం చూస్తాం అంటారు. కానీ మెగాస్టార్ మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. ఇంకో రెండు రోజుల్లో వీటి విషయంలో క్లారిటీ వస్తుంది. దాసరి గారు లేని లోటు మెగాస్టార్ చిరంజీవి పూడ్చారు అని అందరికీ తెలిసి వస్తుంది.
Also Read: Yellamma Movie : ఎల్లమ్మ ఆగిపోయిందా ? బయటికొచ్చేసిన బలగం వేణు ?