Alekhya Chitti Sisters:అలేఖ్య చిట్టి పికిల్స్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన అలేఖ్య చిట్టి సిస్టర్స్ కొద్ది రోజుల్లోనే చాలా వైరల్ అయ్యారు. పికిల్స్ మార్కెట్లో బాగా అమ్ముడు పోవడంతో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియా పచ్చళ్ళు అనే బ్రాండ్ లాగా పేరు తెచ్చుకున్నాయి. అయితే అలాంటి అలేఖ్య చిట్టి సిస్టర్స్ లో ఒకరైన అలేఖ్య పెట్టిన ఒకే ఒక్క బ్యాడ్ కామెంట్ వల్ల చివరికి పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మానసిక వేదనకు గురై హాస్పిటల్ లో కూడా జాయిన్ అయింది. డిప్రెషన్ నుండి బయట పడ్డాక మళ్ళీ పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేసింది.
అలేఖ్య జెండర్ మార్చేసుకుందా?
ఇదంతా పక్కన పెడితే గత కొద్ది రోజుల నుండి అలేఖ్య కొత్త లుక్ లో దర్శనమిస్తోంది. షార్ట్ హెయిర్ తో అబ్బాయిలు వేసుకునే డ్రెస్ల్ లో కనిపించడంతో చాలామంది ఈ వీడియోలు చూసి ఇదేంటి అలేఖ్య జెండర్ మార్చేసిందా.. దెబ్బకు సర్జరీ చేసుకుందిగా అంటూ ఎన్నో కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ కామెంట్లు విని విని విసిగిపోయిన అలేఖ్య సిస్టర్ సుమ తాజాగా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసింది.మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? నిజంగానే అలేఖ్య జెండర్ మార్చేసుకుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
షార్ట్ హెయిర్ పై అలేఖ్య సిస్టర్ క్లారిటీ..
అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్లలో ఒకరైన సుమ కూడా ఇన్స్టా, యూట్యూబ్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్. అయితే తాజాగా సుమ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో తన సిస్టర్ అలేఖ్య గురించి మాట్లాడుతూ.. “చాలామంది మా చెల్లెలు షార్ట్ హెయిర్ చూసి ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది పాజిటివ్గా పెడితే కొంతమంది నెగటివ్ గా పెడుతున్నారు. ఇక మరికొంతమందైతే చాలా దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. అందులో చాలామంది గర్ల్ టు బాయ్ సర్జరీ చేయించుకుందని కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకూ.. ఆమె షార్ట్ హెయిర్ ఎందుకు చేయించుకుందో చెబుతాను.
ఇంత గొప్ప పని చేస్తుందా?
మా చెల్లికి కాలేజ్ డేస్ నుండే క్యాన్సర్ పేషెంట్లకు హెయిర్ డొనేట్ చేసే అలవాటు ఉంది. అందుకే ప్రతి 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి హెయిర్ డొనేట్ చేస్తుంది. మా అక్కాచెల్లెళ్లలో అలేఖ్యకే ఎక్కువ జుట్టు పెరుగుతుంది.పెరిగిన జుట్టు మొత్తాన్ని క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేస్తుంది.
ట్రోలర్స్ పై మండిపడ్డ అలేఖ్య సిస్టర్ సుమా..
కానీ ఈ విషయం తెలియని వాళ్లు సర్జరీ చేయించుకుందని చీప్ గా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో క్యాన్సర్ పేషెంట్లకు హెయిర్ ఇస్తుందా అంటే ఎవరికి ఇస్తుంది. ఆ డీటెయిల్స్ చెప్పండని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ చెప్పడానికి మాకేం తెలుసు. అసలు ఆమె ఇచ్చిన హెయిర్ ఏ క్యాన్సర్ పేషెంట్ కి వెళ్తుందో తెలియదు. కొన్ని ఎన్జీవోస్ వచ్చి హెయిర్ కలెక్ట్ చేసుకొని వెళ్తాయి. ఈ చిన్న విషయం కూడా ఈ కామెంట్ పెట్టే వ్యక్తికి తెలియదా.. ఇక ఓ అమ్మాయి అయితే ఏకంగా చేసిన పాపాలు వాష్ చేసుకోవడానికి ఇలా క్యాన్సర్ పేషెంట్లకు హెయిర్ డొనేట్ చేస్తుంది అంటూ పెట్టింది. చేసిన పాపాలంటే ఏంటి.. మనిషి జన్మ ఎత్తినప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. దానికే మేమేదో పెద్ద పాపాలు చేసేసినట్టు మాట్లాడుతున్నారు.
మీరు కూడా పాపం చేస్తున్నారు..
ఒక వ్యక్తిని చంపడమే పాపం కాదు. ఒక వ్యక్తి మన వల్ల ఒక క్షణం పాటు బాధపడినా కూడా పాపమే. ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్ వల్ల మేము బాధపడ్డాం.కాబట్టి మీరు కూడా పాపం చేసినట్టే అంటూ తన చెల్లెలిపై వచ్చిన నెగిటివ్ కామెంట్లన్నింటికి సుమ యూట్యూబ్లో లాంగ్ వీడియో పెట్టి క్లారిటీ ఇచ్చింది.మరి సుమ ఇచ్చిన క్లారిటీతోనైనా అలేఖ్యపై వచ్చే ఈ నెగటివ్ కామెంట్లు ఆగిపోతాయా అనేది చూడాలి.
ALSO READ:Dilraju: రాజుగారికి ఏం అయింది.. ఆయన జడ్జిమెంట్‌కి ఏం అయింది ?