Yellamma Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒక అవకాశం వచ్చి ప్రూవ్ చేసుకుంటే ఆ దర్శకుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. ఆ షో కంటే ముందు కొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. అయితే జబర్దస్త్ విపరీతమైన గుర్తింపు తీసుకువచ్చింది. ఒక తరుణంలో అతిపెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది.
అయితే కొన్ని రోజుల తర్వాత వేణు విపరీతమైన ప్రయత్నాలు చేసి బలగం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామందిని ఈ సినిమా కదిలించింది. కొన్ని ఊర్లలో ఈ సినిమాని తెర బొమ్మ వేసుకొని మరీ చూశారు. అంతటి మార్పుని ఈ సినిమా తీసుకొచ్చింది. అలానే ఈ బ్యానర్ కి విపరీతమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. వేణు లో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపడిపోయారు.
నాని అవకాశం.. నితన్ గ్రీన్ సిగ్నల్
నాకు ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమాలలో విపరీతంగా ఆకట్టుకుంది బలగం అంటూ నాని పలు సందర్భాల్లో చెప్పాడు. ఒక తరుణంలో వేణుకు కూడా తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ఎల్లమ్మ. ఎల్లమ్మ కథ కూడా నానికి విపరీతంగా నచ్చింది. కానీ కొన్ని కారణాల వలన నాని ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా దిల్ రాజు ఈ సినిమా చేస్తాడు అని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు దిల్ రాజు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా నితిన్ హీరోగా నిర్మించిన తమ్ముడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కంప్లీట్ డిజాస్టర్ గా మారిపోయింది. అలానే గేమ్ చేంజెర్ సినిమా కూడా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి వలన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దిల్ రాజుకి కొంత ఉపశమనం కలిగింది.
బయటకొచ్చేసిన వేణు
ఇకపోతే వేణుకి దిల్ రాజు కాకుండా, ఇద్దరు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారట. దానిలో ఒకటి కంప్లీట్ చేసుకుని మళ్లీ వస్తా అని దిల్ రాజుతో చెప్పాడట. వాస్తవానికి ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలవుతుంది అని దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. వేణు మీద విపరీతమైన నమ్మకం ఉన్నా కూడా నితిన్ కి ఉన్న మార్కెట్ వలన వెనుకంచి వేయాల్సి వస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండ సినిమాను కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. అందుకే దిల్ రాజు ఇలా లేట్ చేయడం వలన వేణు కి టైం వేస్ట్ అవుతుంది. బయట నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ లోపు అక్కడ సినిమా ఫినిష్ చేసి వస్తే, ఈలోపు దిల్ రాజు కూడా సెట్ అవుతారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒక హీరో మార్కెట్ వలన చాలా క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి.