Bank Holidays: మన దయనందిన జీవితం బ్యాంకింగ్ సేవలపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నగదు అవసరం, చెక్కు లావాదేవీలు, లేదా ఖాతాల ట్రాన్సాక్షన్ల పరంగా బ్యాంకులకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు మూడు రోజుల పాటు వరుసగా మూతబడితే ఎలా ఉంటుంది? పనులన్నీ ఆగిపోవడం ఖాయం. అచ్చంగా అలాంటి సందర్భమే ఈ ఆగస్టు నెలలో రానుంది.ఆగస్టు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉండే అవకాశముంది. ఈ కారణంగా వినియోగదారులంతా ముందుగానే తమ బ్యాంకు లావాదేవీలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఈ మూడు రోజుల బ్యాంక్ సెలవుల వెనుక ఉన్న కారణాలేంటి? ముందుగా చేయాల్సిన ప్లాన్ ఏమిటో తెలుసుకోండి.
ఈ నెల ఆగస్టులో మొదటగా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు. ఆ రోజున సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన పండుగ – టెండాంగ్‌లో రమ్ ఫండ్ జరుగుతుంది. దీనివల్ల అక్కడ ప్రభుత్వానికీ, బ్యాంకులకీ సెలవు ఉంటుంది. అదేరోజు వరలక్ష్మీ వ్రతం కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా హిందూ మహిళలు జరుపుకునే పవిత్రమైన వ్రతం. దాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించబడింది.
ఆ తర్వాతి రోజు ఆగస్టు 9 శనివారం. ఇది నెలలో రెండో శనివారం కనుక అన్ని బ్యాంకులు మూసివుండడం సాధారణమే. అయినా ఇదే రోజు రక్షా బంధన్ పండుగ కూడా రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సెలవు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆగస్టు 10 ఆదివారం. అది ఇకపై చెప్పనక్కర్లేదు – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవుగా ఉంటుంది.
ఈ మూడురోజులూ వరుసగా బ్యాంకులు పని చేయకపోవడం వల్ల, వినియోగదారులు ముందుగానే తమ అవసరాలు చూసుకోవడం మంచిది. డబ్బు తీసుకోవాలన్నా, చెక్కులు వేసుకోవాలన్నా, ఇతర లావాదేవీలు పూర్తిచేయాలన్నా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే మంచిది. ఏటీఎంలకు క్యూ పెరిగే అవకాశముంది. డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నా కొన్ని సేవల కోసం మానవ సహాయం అవసరం కావచ్చు.
అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్తించకపోవచ్చు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా స్థానిక పండగలు, పరిస్థతులు బట్టి సెలవులు నిర్ణయిస్తారు. కాబట్టి మీ ప్రాంతానికి చెందిన బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచింది. ఇలా మూడురోజుల సెలవులు వరుసగా ఉండటం వలన, ముందస్తుగా బ్యాంకు పనులను చూసుకుంటే మంచిదని దాని ద్వారా మనకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.