Kaaka Movie: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెబుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేస్తూ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యే సినిమాల జాబితా కూడా చాలా పెద్దగా ఉందని చెప్పాలి. ఒకే రోజు రెండు మూడు సినిమాలను కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మరి ప్రకటించిన సినిమాలన్ని యధావిధిగా విడుదలవుతాయా లేదంటే వాయిదా అవుతాయా అంటూ అభిమానులు కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటించిన కాకా(Kaaka) సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటుందని ఆ స్థానంలో చిరంజీవి నటించిన విశ్వంభర (Vishwambhara) రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ విషయంలో చిత్రాహ నిర్మాతల నుంచి క్లారిటీ లేకపోవడంతో మెగా ఫాన్స్ గందరగోళంలో ఉన్నారు. ఇకపోతే తాజాగా కాకా వాయిదా అంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ సినీ రచయిత దర్శకుడు కోన వెంకట్(Kona Venkat) స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కోన వెంకట్ తాజాగా కాకా సినిమా షూటింగ్ లొకేషన్లో భాగంగా చిరంజీవి గారిని కలిసారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మరోసారి కాకా విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ వార్తలన్ని పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ముందుగా అనుకున్న విధంగానే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ కాకా విడుదల కాబోతుందని తెలిపారు.
సంక్రాంతికి కాకా వస్తున్నాడు… అసలైన పండుగ తెస్తున్నాడు.. అంటూ కోన వెంకట్ కాకా వాయిదా రూమర్లను ఖండిస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Once again – Rest in Peace all the rumours, all fake news, all the baseless articles about “KAAKA” –
Sorry to disappoint you but we are landing on Jan 13th 🚀సంక్రాతికి “కాకా” వస్తున్నాడు 🔥
అసలైన పండగ తెస్తున్నాడు 🕺@dirbobby @KvnProductions pic.twitter.com/M1q3I9QH4g— KONA VENKAT (@konavenkat99) November 6, 2026
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని సమాచారం. డైరెక్టర్ బాబి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలా కాకా సినిమా సంక్రాంతి రేసులో ఉండడంతో చిరంజీవి విశ్వంభర ఇప్పుడప్పుడే విడుదల లేదని స్పష్టం అవుతుంది. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు వచ్చే సంక్రాంతికి కాకాతో ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నారో తెలియాల్సింది. ఇదివరకే చిరంజీవి బాబి డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో కాకా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!