E-Paper
Advertisement

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం… తొలి ఇండియన్ హీరోగా గుర్తింపు!

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం… తొలి ఇండియన్ హీరోగా గుర్తింపు!
Advertisement

Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుకు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గౌరవప్రదమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నటుడిగా ఇప్పటికే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి తాజాగా ప్రపంచ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా 2026 నవంబర్ 23న జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల (54th International Emmy Awards) ప్రదానోత్సవ వేడుక జరగబోతోంది.

అంతర్జాతీయ వేదికపై విజయ్ సేతుపతి..

ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ సేతుపతి ఈ పురస్కారాన్ని అందజేసే ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ అవార్డు వేడుకలలో భాగంగా వేదికపై పురస్కారాన్ని ప్రెజెంట్ చేయనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి నిలవడం విశేషం. ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి ఘనత ఏ హీరోకి దక్కలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది తమిళ దర్శక నిర్మాతలు నటీనటులు విజయ్ సేతుపతికి అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన హీరోగా అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

మహారాజా మూవీకు హాలీవుడ్ రీమేక్ రైట్స్..

Advertisement

ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే.. ఈయన ఇటీవల నటించిన మహారాజా సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హాలీవుడ్ రీమేక్ రైట్స్ అమ్మడు పోవటం గమనార్గం. ఈ సినిమా తమిళంలో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈయన ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు సిద్ధంగా స్లమ్ డాగ్…

ఇక విజయ్ సేతుపతి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన స్లమ్ డాగ్(Slum Dog) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే..దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ఇంచి వెల్లం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. వరుస సినిమాల అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ సేతుపతి తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఈయనతో పూర్తిస్థాయి తెలుగు సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది.

Advertisement

Also Read: ‘మహాశక్తి’ మూవీ రివ్యూ..అమ్మవారిగా నయన్ మెప్పించిందా?

Related News

‘మత్తు వదలరా’ మూవీ నటి అరెస్ట్.. జాబితాలో ఇంకెంతమందో?

గుండె ఆగిపోతుందేమోనని భయపడ్డా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అలీ భార్య!

మేనత్తగా ప్రమోట్ అయిన మెగాకోడలు లావణ్య.. ఎవరు పుట్టారో తెలుసా?

14 ఏళ్లుగా వనవాసం చేస్తున్నా.. విడాకులపై రేణు దేశాయ్ ఎమోషనల్!

సింపుల్ గా కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

టీనేజ్ లోనే లవ్.. అదే నా ప్రేమను పట్టించింది: కీర్తి సురేష్

Big Stories

Advertisement
×