Zubeda Ali:టాలీవుడ్ స్టార్ కమెడీయన్ అలీ భార్య జుబేదా అలీకి తాజాగా హార్ట్ సర్జరీ జరిగిన సర్జరీ జరిగిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జుబేదా .. తన ఆరోగ్య పరిస్థితి నుంచి అలీతో సాగిన 32 ఏళ్ల వైవాహిక జీవితం వరకు ఎన్నో విషయాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తనకు గుండె సమస్య ఉందని తెలిసినప్పుడు పడ్డ భయం, తల్లిదండ్రులను కోల్పోయిన చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న తీరు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గుండె సమస్య చిన్నప్పటి నుంచే
జుబేదా అలీ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉందనే విషయం ఈ మధ్యే తెలిసిందని చెప్పారు. అప్పటివరకు తనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అసలు అలాంటి సమస్య ఉందని ఊహించలేదని చెప్పింది. అనంతపూర్‌లో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరగడం, కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయని ఆరోజు ఏం జరిగిందో వివరించింది.
ఆ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడంతో గ్యాస్ సమస్య అయి ఉంటుందని మొదట్లో అనుకున్నామని పక్కనే ఉన్న ప్యామిలీ మెంబర్స్ కూడా అదే అనుకుని గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి రిలాక్స్ అవ్వమని చెప్పారని చెప్పింది. కానీ ఎంత ప్రయత్నించినా బెడ్‌పై పడుకోలేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో భయపడిపోయానని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది.
ఆ సమయంలో తన గుండె వేగం నిమిషానికి 250కి పైగా చేరిందని, పరిస్థితి తీవ్రంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది.
తల్లిదండ్రుల మరణం గుర్తొచ్చి..
ఇక తనకిఈ పరిస్థితి ఎదురైనప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయిన విషయం గుర్తుకువచ్చిందని చెప్పింది. తన తల్లికి గుండెలో నొప్పి వచ్చినా గ్యాస్ సమస్య అనుకుని ఆసుపత్రికి వెళ్లలేదని, తీరా ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయిందని బాధ పడింది.
ఇక తల్లి చనిపోయిన పదేళ్ల తర్వాత తన తండ్రికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైందని తెలిపింది. రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినా మొదట్లో ఎవరికీ చెప్పలేదని, ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లగానే వీల్‌చైర్‌లోనే ప్రాణాలు కోల్పోయారని ఎమోషనల్ అయిపొయింది.
ఇక ఇప్పుడు తనకు కూడా గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆ పాత సంఘటనలన్నీ కళ్లముందు కదిలాయని తెలిపింది.ఇలా ఆసుపత్రికి వెళ్లే 15 నిమిషాల ప్రయాణంలోనే తన జీవితంలో చేయాల్సిన పనులు, కుటుంబం, పిల్లలు, భర్త గురించి ఎన్నో ఆలోచనలు వచ్చాయని తెలిపింది.
తనకు ఏదైనా జరిగితే ఇద్దరు చిన్న పిల్లలను అలీ ఎలా చూసుకుంటారోనని బాధపడిపోయానని, తన భర్తకు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటానని, కానీ తనకే ఇలాంటి సమస్య రావడంతో ఆయన ముందు తలెత్తుకోలేనేమోనని కూడా అనుకున్నాని మనసులోని మాటని బయటపెట్టింది.
ఎస్వీటీ సమస్య.. ఇంజెక్షన్‌తో తగ్గిన వేగం
ఇక అనంతపురం ఆసుపత్రిలో డాక్టర్స్ పరీక్షలు చేసిన తర్వాత జుబేదాకు ఎస్వీటీ (SVT) అనే గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారని, గుండె వేగాన్ని తగ్గించడానికి ఇంజెక్షన్ ఇచ్చారని తెలిపింది.ఇక అది గనుక పనిచేయకపోతే విద్యుత్ షాక్ ఇవ్వాల్సి వస్తుందని తనతో వచ్చిన ఆయిషాకు డాక్టర్స్ వివరించారని గుర్తుచేసుకుంది.
ఇక ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే గుండె వేగం తగ్గిందని తెలిపారు. గంటసేపు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినప్పటికీ అప్పటికే పెద్ద ఎగ్జిబిషన్ కోసం చాలామందిని ఇన్ వైట్ చేయడంతో వారిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తిరిగి కార్యక్రమానికి వెళ్లానని చెప్పుకొచ్చింది.
తన ఆరోగ్య పరిస్థితి గురించి అలీకి వెంటనే చెప్పలేదని ఆయన కంగారుపడతారనే ఉద్దేశంతో మొదట బీపీ తగ్గిందని మాత్రమే చెప్పారని ఎగ్జిబిషన్‌లో ఫొటోలు, కార్యక్రమాలు పూర్తయ్యాక గదికి వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పినట్లు ఆరోజు జరిగిన ఇన్సిడెంట్ ని వివరించింది జుబేదా అలీ !
ALSO READ :ఏందిరా ఈ బీటు.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మళ్లీ దుమ్మురేపాడుగా!