E-Paper
Advertisement

బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘దాదా’ పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!
Advertisement

Dada First Single: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 111 వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni)దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దాదా(Dada) అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా బాలకృష్ణకు సర్జరీ జరగడంతో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో అనుకున్న విధంగానే డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కావడం కష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దాదా ఫస్ట్ సింగిల్ అప్డేట్..

ఇలా బాలకృష్ణ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలపై ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. ఈ ఊహగానాలకు తెర దించుతూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోంది అంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ డైరెక్టర్ గోపీచంద్ తెలియచేశారు.

విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్న దాదా ఫస్ట్ సింగిల్..

Advertisement

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master)పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. దాదా సినిమాలో మీరు కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ సింగిల్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులందరికీ కూడా కనువిందు చేయబోతుందని తెలియజేశారు. ఇక ఫస్ట్ సింగిల్ వచ్చే వారాంతంలో ఉండబోతుందని ఈ సందర్భంగ గోపీచంద్ ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇవ్వడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని కూడా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

దాదా ఫస్ట్ సింగిల్ నెక్స్ట్ వీకెండ్ లో విడుదల కాబోతుందనే విషయాన్ని డైరెక్టర్ తెలియచేయడంతో ఈ సినిమా విడుదలపై కూడా స్పష్టత వచ్చిందని చెప్పాలి. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కావడంతో ప్రమోషన్లలో భాగంగా ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారని, ఇలా ప్రమోషన్లను మొదలు పెట్టడంతో సినిమా యధావిధిగా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించారు. ఈ సినిమా యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మంచు మనోజ్ నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

Also Read: శూర్పణఖ మేకప్ కోసం రోజుకు అన్ని గంటలా? రకుల్ కామెంట్స్ వైరల్!

Related News

మొదట్లో జోరు..ఇప్పుడు బేజారు!.ఆదర్శకుటుంబం ఇక అంతేనా?

శూర్పణఖ మేకప్ కోసం రోజుకు అన్ని గంటలా? రకుల్ కామెంట్స్ వైరల్!

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం… తొలి ఇండియన్ హీరోగా గుర్తింపు!

‘మత్తు వదలరా’ మూవీ నటి అరెస్ట్.. జాబితాలో ఇంకెంతమందో?

గుండె ఆగిపోతుందేమోనని భయపడ్డా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అలీ భార్య!

మేనత్తగా ప్రమోట్ అయిన మెగాకోడలు లావణ్య.. ఎవరు పుట్టారో తెలుసా?

14 ఏళ్లుగా వనవాసం చేస్తున్నా.. విడాకులపై రేణు దేశాయ్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×