E-Paper
Advertisement

ఆసుపత్రి బెడ్‌పైనే దారుణ హత్య… షాకింగ్ రియల్ మర్డర్ ఆధారంగా రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ

ఆసుపత్రి బెడ్‌పైనే దారుణ హత్య… షాకింగ్ రియల్ మర్డర్ ఆధారంగా రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ
Advertisement

Spanish True Crime Documentary: నిజ జీవితంలో జరిగిన కొన్ని హత్యలు సినిమాల్లో చూపించే క్రైమ్ కథలకంటే భయంకరంగా ఉంటాయి. అలాంటి క్రైమ్స్ వింటేనే చట్టం, సొసైటీపై ఉన్న నమ్మకం పోతుంది. 2015 లో స్పెయిన్ దేశాన్ని మొత్తం షేక్ చేసిన ఒక భయంకరమైన యదార్థ హత్య ఉదంతం ఆధారంగా రూపొందిన గ్రిప్పింగ్ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘Unprotected: Murder in Galicia’. ఒక బాధితురాలికి ప్రాణహాని ఉందని తెలిసినా, ఆమెకు సరైన రక్షణ కల్పించలేకపోవడం.. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె హత్యకు గురవడం ఎంతటి దిగ్భ్రాంతికి గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది.

స్టోరీ ఏమిటంటే ?

ఈ డాక్యుమెంటరీ కథ గలిసియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఇసాబెల్ ఫ్యుయెంటెస్ అనే వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి కొందరు అపరిచిత దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడి, దొంగతనం ముసుగులో ఇసాబెల్‌ను చావు అంచుల్లోకి నెట్టేలా దారుణంగా అటాక్ చేస్తారు. లక్కీగా ఆమె ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న గార్డియా సివిల్ సెర్గెయంట్ కి ఈ దొంగతనం స్టోరీ వెనుక ఏదో హిడెన్ మిస్టరీ ఉందని, ఇసాబెల్ కి తన సొంత సర్కిల్ లో ఉన్న వాళ్ళ నుండే ప్రాణాపాయం ఉందని అనుమానం వస్తుంది. దాంతో ఆఫీసర్ ఆమెను కాపాడటానికి పోలీసు ప్రొటెక్షన్ అడుగుతాడు. కానీ సిస్టమ్ లోని లోపాల వల్ల ఆమెకు సరైన ప్రొటెక్షన్ దొరకదు.

Advertisement

షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. దాదాపు 37 రోజుల తర్వాత, హాస్పిటల్ బెడ్‌పైనే ఆమె రికవర్ అవుతున్న రూమ్ లోకి ఎవరో చొరబడి ఇసాబెల్‌ను దారుణంగా మర్డర్ చేస్తారు. ప్రొటెక్షన్ లో ఉండాల్సిన ఒక విక్టిమ్ హాస్పిటల్ లోనే ఎలా హత్యకు గురైంది? ఆ సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ లో ఉన్న అసలు నిందితుడు ఎవరు? అనే కోణంలో రియల్ ఇన్వెస్టిగేటర్స్, డాక్టర్స్, జర్నలిస్ట్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ తో ఈ డాక్యుమెంటరీని మైండ్ బ్లోయింగ్ గా తెరకెక్కించారు. ట్రూ-క్రైమ్ లవర్స్ ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

‘Unprotected: Murder in Galicia’ నిజ జీవిత ఘటనను ఇంటర్వ్యూలు, వాంగ్మూలాలు, పరిశోధనాత్మక వివరాల ద్వారా ఆవిష్కరించే డాక్యుమెంటరీ ఫిల్మ్. జార్జ్ లాప్లాస్ దర్శకత్వం వహించగా, కార్లెస్ పోర్టా, పాబ్లో ఫెర్నాండెజ్ మాసో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇది స్పానిష్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ ఆడియోతో Netflixలో 2026 నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

Advertisement

Read Also: ఇంట్లో చావుల పరంపర… వెళ్లిన వాళ్లను వదలకుండా వెంటాడే దెయ్యం… హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హారర్‌

Tags

Related News

భర్త ఉండగానే మరొకరితో… కెమెరా ముందే బట్టబయలైన నిజాలు… క్రేజీ కొరియన్ రిలేషన్‌షిప్ డ్రామా

గ్యాస్ స్టేషన్ నుంచి గ్రాండ్ బ్యాంక్ రాబరీ దాకా… అందమైన మోసగాడితో యువతి కిరాక్ క్రైమ్ జర్నీ

విమాన ప్రమాదం… మంచు అరణ్యంలో ఒంటరి పోరాటం… కదిలించే సర్వైవల్ థ్రిల్లర్

ఒక్క జూదంతో మొత్తం సామ్రాజ్యం బూడిద… చేతికి వేరే ప్రాణం… ఓటీటీలో దుల్కర్ సల్మాన్ గేమ్ స్టార్ట్

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్… కాలేజీ అందగాడితో ఒకే ఇంట్లో… యూత్ మస్ట్ వాచ్

ముగిసిన ‘ది ట్రైటర్స్’ తెలుగు సీజన్ 1.. విజేతలు ఎవరంటే?

గోవా డ్రీమ్ జాబ్… ఊహించని లవ్‌స్టోరీలో అపార్థం తెచ్చిన పెను తుఫాన్… ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×