Adarsha Kutumbam:వెంకీమామ ,గురూజీ కాంబోలో వచ్చిన ఆదర్శకుటుంబం అక్టోబర్ 30న రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.ఈ ఇద్దరి కాంబోలో (రచయిత-హీరో) ఇది వరకే నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి వంటి రెండు కల్ట్ సినిమాలు రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది కూడా. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, వెంకటేష్ టైమింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫిక్స్ అయ్యారు అంతా.
కాని అక్టోబర్ 30న వచ్చిన ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఆ అంచనాలకు భిన్నంగా కనిపిస్తోంది.మొదటి మూడు రోజులు ఈ సినిమా సౌండ్ సాలిడ్ గానే చేసింది. మొత్తంగా వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 32 కోట్ల నెట్ కొల్లగొట్టడంతో సినిమా ఈజీగానే వందకోట్లు వెనకేస్తుందని అనుకున్నారు.కానీ మూడు రోజులు అయ్యాక గానీ అసలు సినిమా ఏంటో అర్థం కాలేదు. వీకెండ్లో చూపించిన జోరును వారం మధ్యలో సినిమా కంటిన్యూ చేయలేకపోయాడు వెంకీ మామ.
సోమవారం వసూళ్లు 3 కోట్లకు పడిపోగా, మంగళవారం 2 కోట్లు, బుధవారం 2 కోట్లు, గురువారం నాటికి కేవలం 1.50 కోట్లకు పడిపోయిందన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.దీన్ని బట్టి చూస్తే సినిమా ఆడియన్స్ ని ఈ సినిమా ఎంతలా డిసప్పాయింట్ చేసిందో అర్థం అవుతుంది.మాములుగా స్టార్ హీరోల సినిమాలు వీకెండ్ అయిపోయినప్పటికీ వసూళ్లు కాస్త స్థిరంగా ఉంటాయి.కానీ వెంకీ మామ సినిమా మాత్రం నాలుగో రోజు నుండి చేతులెత్తేయడం గమనార్హం.
మొత్తంగా ఏడు రోజుల్లో నేషనల్ వైడ్ గా దాదాపు 48 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తుంది. నైజాంలో 17 కోట్లు, ఆంధ్రాలో 16 కోట్లు, సీడెడ్లో 4 కోట్లు, కర్ణాటకలో 5 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఇక పుంజుకునే అవకాశం లేనట్టే కనిపిస్తుంది.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు 65 కోట్ల రూపాయల వరకు జరగగా, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా 110 నుంచి 120 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని సమాచారం.గతంలో వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలు, అలాగే త్రివిక్రమ్ తీసిన ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాయో చెప్పక్కర్లేదు.సినిమాలో కంటెంట్ కనెక్ట్ కాకపోవడం, మరో వైపు మూకుమ్మడిగా మరిన్ని సినిమాలు ఎటాక్ చేయడంతో ఆదర్శకుటుంబం అనుకున్నంత వసూళ్ళని రాబట్టలేకపోయిందని టాక్.అయితే నిర్మాతలకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొంత రిలీప్ దక్కిందని తెలుస్తుంది.
ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్ అని హైప్ తెచ్చుకున్న ఈ జోడీ బాక్సాఫీస్ వద్ద ఇలా బోల్తా కొట్టడంతో డిసప్పాయింట్ అయిపోయారు మూవీ లవర్స్.చూడాలి మరి తారక్ తో తీసే సినిమాతో అయినా గురూజీ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి !
ALSO READ :గుండె ఆగిపోతుందేమోనని భయపడ్డా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అలీ భార్య!