E-Paper
Advertisement

శూర్పణఖ మేకప్ కోసం రోజుకు అన్ని గంటలా? రకుల్ కామెంట్స్ వైరల్!

శూర్పణఖ మేకప్ కోసం రోజుకు అన్ని గంటలా? రకుల్ కామెంట్స్ వైరల్!
Advertisement

Rakul Preet Singh: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఒకరు. అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు దూరమైన ఈమె వరస బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా ఈమె నితీష్ తివారి(Nitesh Tiwari) డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ(Ramayana) సినిమాలో కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో రకుల్ సందడి చేశారు.

మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి..

ఇక రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శూర్పణఖ పాత్రలో నటించడం గురించి రకుల్ ప్రీతిసింగ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన రామాయణ గాథను భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టును అందించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

గర్వపడే అరుదైన క్షణం..

Advertisement

ఇక ఈ సినిమాలో తనతో పాటు నటించిన రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి తదితరులకు ఈమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక శూర్పణఖ పాత్రలో నటించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఇలాంటి పాత్ర కోసం ప్రతిరోజు నాలుగు గంటల పాటు ఎంతో కష్టపడి తనని శూర్పణఖ రూపంలోకి తీసుకువచ్చిన కాస్ట్యూమ్ మరియు మేకప్ టీం పట్ల కూడా రకుల్ ప్రశంసించారు. రామాయణ అంటే తాను నటించిన మరో సినిమా మాత్రం కాదని భారతీయురాలిగా తాను ఎప్పటికీ గర్వపడే అరుదైన క్షణం అని ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Advertisement

ఇలా రామాయణ సినిమాలో తాను భాగం అవ్వటం సంతోషంగా ఉందంటూ రకుల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఈమెను శూర్పణఖ పాత్రలోకి తీసుకురావడం కోసం ప్రతి రోజు నాలుగు గంటల పాటు మేకప్ వేసేవారిని తెలపడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో యశ్ నటించిన సంగతి తెలిసిందే. రాముడిగా రణబీర్ కపూర్ నటించగా సీత పాత్రలో సాయి పల్లవి సందడి చేశారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 155 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు మేకర్స్ అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం… తొలి ఇండియన్ హీరోగా గుర్తింపు!

Related News

విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం… తొలి ఇండియన్ హీరోగా గుర్తింపు!

‘మత్తు వదలరా’ మూవీ నటి అరెస్ట్.. జాబితాలో ఇంకెంతమందో?

గుండె ఆగిపోతుందేమోనని భయపడ్డా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అలీ భార్య!

మేనత్తగా ప్రమోట్ అయిన మెగాకోడలు లావణ్య.. ఎవరు పుట్టారో తెలుసా?

14 ఏళ్లుగా వనవాసం చేస్తున్నా.. విడాకులపై రేణు దేశాయ్ ఎమోషనల్!

సింపుల్ గా కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×