Tollywood:మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై చిరంజీవి, హేమలత నిర్మాణ సారధ్యంలో.. రితేష్ రానా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం మత్తు వదలరా.. 2019 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శ్రీ సింహ, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, బ్రహ్మజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో.. సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే మత్తు వదలరా చిత్రంలో హీరోయిన్గా నటించిన అతుల్య చంద్ర (Athulya chandra) ఇప్పుడు అరెస్ట్ అవ్వడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈమెతో పాటు బిబిన్ పెరుంబిల్లి సహ ముగ్గురిని అరెస్టు చేశారు. ఇక పరారీలో మిగిలిన 9 మంది నిందితుల కోసం చర్యలు ముమ్మరం చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఒక యువ డాక్టర్ ను ఫ్లాట్ కి పిలిపించి, ఆపై ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, లక్షలాది రూపాయల విలువైన వస్తువులను దోచుకున్న ఘటన ఇప్పుడు కొచ్చిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొచ్చిలోని ఎస్ ఎన్ స్ప్రింగ్ డేల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే ఒక ఫ్లాట్ లో ఉన్న వ్యక్తికి తక్షణ వైద్య సహాయం కావాలంటూ నిందితులు సదరు యువ డాక్టర్ కి ఫోన్ చేసి నమ్మించారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డాక్టర్ ఆ అపార్ట్మెంట్ కి చేరుకోగా.. అక్కడ ఉన్న దాదాపు 12 మంది.. డాక్టర్ ఫ్లాట్ లోకి రాగానే తమ బంధువుపై అత్యాచారం చేసారంటూ నిందలు మోపి కేసు పెడతామని బెదిరించారు.
ఆ తర్వాత నటుడు బిబిన్ పెరుంబిల్లి , అతడి అనుచరులు డాక్టర్ ను బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కటెముకలపై ముఖంపై విచక్షణారహితంగా దాడి చేశారు. అదే సమయంలో అతుల్య చంద్ర డాక్టర్ వద్ద ఉన్న రూ.3.5 లక్షల విలువైన ఐఫోన్, స్మార్ట్ వాచ్ , వైర్లెస్ ఇయర్ ఫోన్ ను బలవంతంగా లాగేసుకుంది. చంపేస్తామని బెదిరిస్తూ ఆయనను గదిలో బంధించారు . అయితే బాధిత డాక్టర్ నిందితుల నుండి చాలా తెలివిగా తప్పించుకొని కడవంతర పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశారు.
also read:మేనత్తగా ప్రమోట్ అయిన మెగాకోడలు లావణ్య.. ఎవరు పుట్టారో తెలుసా?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అతుల్య , బిబిన్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 9 మంది కోసం గాలిస్తున్నారు. ఏది ఏమైనా తెరపై నటులుగా ప్రేక్షకులను నవ్వించిన ఈ నటులు ఇప్పుడు తెరవెనుక దొంగలుగా మారి డాక్టర్ పై దాడి చేయడమే కాకుండా దోపిడీ చేయడం సంచలనంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన నటులే ఇలా దొంగలుగా మారడంతో నెటిజన్లు, వారి అభిమానులు కూడా మండిపడుతున్నారు ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.