Anil Vallabhaneni Announce Press Meet: కొన్ని రోజులుగా చిత్రపురి కాలనీ వివాదం హాట్ టాపిక్ గా మారింది. సినీ కార్మికులకు ఇవ్వాల్సిన ప్లాట్స్ ని బయటి వాళ్లకు అమ్ముకుంటున్నట్టుగా చిత్రపురి హౌసింగ్ సోసైటి అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయంలో సినీ కార్మికుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిన్నింటిపై క్లారిటీ ఇచ్చేందుకు అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. ఈ కార్యక్రమానికి మీ సందేమాలను నివృత్తి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కి సంబంబధించిన వివరాలను ప్రకటించారు.
చిత్రపురి కాలనీ వివాదం
ఈనెల 25న శుక్రవారం 2 30 గంటలకు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు.. చిత్రపురి కాలనీ పై పదే పదే ఆరోపణలు చేస్తున్న వారికి. పోరాటాలు, ధర్నాలు చేస్తున్నవారికి అందరికి సందేహాలు నివృత్తి చేయడానికి చిత్రపురి కమిటీ ముందుకు వస్తోంది. కావున చిత్రపురి కాలనీపై సందేహాలు, అపోహాలు ఉన్నవారు అన్ని ఆధారాలతో ఈ చర్చలో పాల్గొని సభ్యులు ఆహ్లాద వాతావరణంలో ఉండే విధంగా మంచి నిర్ణయాలతో ముందుకు సాగి, చిత్రపురి అభివృద్ధికి సహకరించాలని కోరారు. చిత్రపురి పై సందేహాలు ఉన్న వారంత అంతా పాల్గొని వారి సందేహాలకు సమాధానాలను పొందాలని ఆయన పేర్కొన్నారు.
అనిల్ వల్లభనేని ప్రెస్ మీట్
అంతేకాదు చిత్రపురి పై వస్తున్న అభియోగాలు, ఆరోపణలకు ఈ ప్రెస్ మీట్ తో సమాధానం చెప్పాలని, వాటికి ఈ మీడియా సమావేశం ద్వారా చెక్ పెట్టాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా 1994లో చిత్రపురి హౌసింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి అక్కడ సినీ కార్మికుల కోసం అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేపట్టారు. వీటిని నిర్మించి అతి తక్కువ ధరకు సినీ కార్మికులకు మాత్రమే అమ్మాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చిత్రపురి హౌసింగ్ సోసైటీనే చూసుకుంటుంది. ఒక స్క్వేర్ పీట్ కి రూ. 4 వేల చొప్పున అమ్మాలని, అందులో రూ. 2 వేలు స్థలానికి కాగా.. మరో రూ. 2 వేలు నిర్మాణ ఖర్చులుగా నియమించారు.
ఎన్ఆర్ఐలతో భేరాలు..
కానీ, ప్రస్తుతం ఆ ధరను రూ. 6999 పెంచేసి ఎన్ఆర్ఐలకు అమ్ముకుంటున్నట్టు కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చిత్రపురి ఫ్లాట్స్ ను ధరలను భారీ పెంచి సామాన్య సినీ కార్మికులకు అందకుండా.. తానా సభల్లో ఎన్ఆర్ఐలకు అమ్మి.. సోమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ తీవ్రఆరోపణలు వినిపిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభలకు అనిల్ వల్లభనేని వెళ్లడమే కారణం. హౌసింగ్ సోసైటీ డబ్బులతో అమెరికా వెళ్లి అక్కడ ఎన్ఆర్ఐలకు చిత్రపురి కాలనీ ఫ్లాట్స్ అమ్మకాల కోసం బేరం కుదుర్చుకున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వాటిన్నింటి పై సందేహాలు తీర్చడకోసమే ఆయన జూలై 25న ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.