BigTV English

OTT Movie : రీల్ కోసం రియల్ గా చంపే డైరెక్టర్ … ఒక్కో స్టైల్లో ఒక్కో ట్విస్టు… క్లైమాక్స్ లో పూనకాలే

OTT Movie : రీల్ కోసం రియల్ గా చంపే డైరెక్టర్ …  ఒక్కో స్టైల్లో ఒక్కో ట్విస్టు… క్లైమాక్స్ లో పూనకాలే

OTT Movie :  హారర్ ఫ్యాన్స్‌కి ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచే ఒక మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఇది ఒక రోడ్ ట్రిప్ హారర్‌గా ప్రారంభమై, ఒక ఊహించని మలుపుతో క్లాసిక్ హారర్ ట్రోప్‌లను ఉపయోగిస్తూ, ఒక గ్రిప్పింగ్ కథగా మారుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ ఇటాలియన్ హారర్-మిస్టరీ మూవీ పేరు ‘ఎ క్లాసిక్ హారర్ స్టోరీ’ (A classic horror story). 2021 లో వచ్చిన ఈ సినిమాకి రాబర్టో డి ఫియో, పావోలో స్ట్రిప్పోలి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఫ్రాన్సిస్కా కవల్లిన్, జస్టిన్ కోరోవ్చెక్, పెప్పినో మజ్జోట్టా, క్రిస్టినా డోనాడియో, అలిడా బాల్డారి కలాబ్రియా, యులియా సోబోల్ నటించారు. ఈ చిత్రం 2021 జులై 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై అనూహ్యమైన ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. 1 గంట 35 నిమిషాల రన్ టీమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.7/10 రేటింగ్ ను కలిగి ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా ఇటలీలో జరిగే ఒక హారర్ కథ. ఐదుగురు వ్యక్తులు ఎలిసా, సోఫియా, మార్క్, రికార్డో, ఫాబ్రిజియో కలిసి ఒక క్యాంపర్ వాన్‌లో దక్షిణ ఇటలీలో ఒక సాధారణ ట్రిప్‌కి బయలుదేరుతారు. ఎలిసా గర్భిణీగా ఉంటే, సోఫియా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే ఒక వైద్య విద్యార్థి, మార్క్ ఒక అమెరికన్ ట్రావెలర్, రికార్డో వృద్ధ డాక్టర్, ఫాబ్రిజియో వాన్ డ్రైవర్ గా ఉంటాడు. ఒక రాత్రి ప్రయాణంలో వీళ్ల వాన్ ఒక జింకను ఢీకొట్టి, చెట్టుకు తగిలి ఆగిపోతుంది. అందరూ కళ్లు తెరిచేసరికి, వాళ్లు ఒక విచిత్రమైన, పాడుబడిన ఇంట్లో ఉంటారు. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. వాన్ కూడా కనిపించదు. బయట దట్టమైన అడవి మాత్రమే కనిపిస్తుంది. ఈ ఇంట్లో వీళ్లు ఒక పుస్తకం కనుగొంటారు. అందులో “త్రీ కీస్” అనే ఒక కల్ట్ గురించి ఉంటుంది.

ఈ కల్ట్ మనుషులను, పిల్లలను బలి ఇచ్చే ఆచారాలు చేస్తుంది. ఆ ఇంట్లో అలిస్ అనే చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఈ కల్ట్‌తో సంబంధం కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక వీళ్లంతా ఆ ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏదో ఒక భయంకరమైన శక్తి వాళ్లను అడ్డుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒకరినొకరు నమ్మలేక, ముఖ్యంగా ఫాబ్రిజియో మీద అక్కడ వాళ్లకి అనుమానం వస్తుంది. అతను కల్ట్‌తో లింక్ ఉన్నాడేమోనని అనుకుంటారు.

కథ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. చివర్లో ఈ కల్ట్ ఆచారం ఒక భయంకరమైన క్లైమాక్స్‌కి దారితీస్తుంది. ఎలిసా తన బిడ్డను కాపాడుకోవడానికి పోరాడుతుంది. అలిస్ అమాయకంగా కనిపించినా, కల్ట్‌తో లోతైన కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ సినిమా తీసే కెమెరాలు కూడా ఉంటాయి. ఇది రియాలిస్టిక్ గా తీయడానికి ఒక దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎలిసాను రియల్ గా చంపి దానిని షూట్ చేయాలనుకుంటాడు ఆ దర్శకుడు. ఇంతకీ వీళ్లంతా ఒక హారర్ సినిమా సెట్‌లో ఉన్నారా ? లేక నిజంగా కల్ట్‌లో చిక్కుకున్నారా ? అక్కడ వీళ్లంతా ఏమవుతారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : సముద్రం మధ్యలో కంటైనర్ లో ప్రెగ్నెంట్ భార్యతో… నెక్స్ట్ ఏమవుతుందా అనే టెన్షన్ తోనే పోతారు

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×