E-Paper
Advertisement

Vijay Ganguly on Tamannaah : తమన్నా నా సినిమాలో వద్దు.. దర్శకుడు సంచలనం

Vijay Ganguly on Tamannaah : తమన్నా నా సినిమాలో వద్దు.. దర్శకుడు సంచలనం
Advertisement

Vijay Ganguly on Tamannaah : హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికీ, తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికీ టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావొస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.

తమన్నా కెరీర్
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లలోనే ఎక్కువగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

Advertisement

వెబ్ సిరీస్‌ల్లో తమన్నా హవా
ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్‌ చేసింది. ‘జైలర్’, ‘స్త్రీ2’ వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తమన్నా గురించి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

ఐటం సాంగ్స్
తమన్నా అటు హీరోయిన్‌గా నటిస్తూనే, మరోవైపు తన డ్యాన్స్‌తో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, తాజాగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’లో ఒక పాట కోసం తమన్నాను తీసుకోవాలని చిత్ర బృందం తొలుత భావించింది. ఈ సినిమాలోని ‘శరరత్’ సాంగ్ కోసం తమన్నా అయితే పర్ఫెక్ట్ అని భావించిన కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ, దర్శకుడు ఆదిత్య ధర్‌కు సూచించారట. కానీ, ఆదిత్య ధర్ మాత్రం అందుకు ససేమిరా అన్నారట.

Advertisement

తమన్నా వద్దన్న దర్శకుడు
దీనికి ఆయన చెప్పిన కారణం ఆశ్చర్యకరంగా ఉంది. దర్శకుడు ఆదిత్య ధర్ తమన్నా గురించి మాట్లాడుతూ… “ఒకవేళ తమన్నా స్క్రీన్‌పై కనిపిస్తే, ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆమె అందం, డ్యాన్స్‌పైనే ఉంటుంది. అప్పుడు అది కేవలం ఒక ఐటమ్ సాంగ్‌లా మిగిలిపోతుంది. కానీ నాకు ఈ పాట కథలో అంతర్భాగంగా ఉండాలి. స్టార్ హీరోయిన్ ఉంటే ఆడియన్స్ కథ నుండి డిస్‌కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఆదిత్య ధర్ వివరించారట. అందుకే భారీ క్రేజ్ ఉన్న తమన్నాను పక్కన పెట్టి, కథకు తగ్గట్టుగా అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాలను ఈ పాట కోసం ఎంపిక చేశారు. అలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని తమన్నా కోల్పోయింది. ప్రస్తుతం ‘శరరత్’ పాట కథలో భాగంగా ఉంటూనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×