E-Paper
Advertisement

Top 20 News: కేసీఆర్ విమర్శలకు సీతక్క స్ట్రాండ్ కౌంటర్, 2029లో పోటీ చేయడం ఖాయం.. కవిత

Top 20 News: కేసీఆర్ విమర్శలకు సీతక్క స్ట్రాండ్ కౌంటర్, 2029లో పోటీ చేయడం ఖాయం.. కవిత
Advertisement

1. కేసీఆర్ విమర్శలకు సీతక్క స్ట్రాండ్ కౌంటర్

KCR విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రజలు ఎప్పుడో BRSతో ఫుట్ బాల్ ఆడారని అన్నారు. ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ ఆటగాడైన మెస్సీతోనే సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడారనీ.. అలాంటిది KCRతో ఫుట్ బాల్ ఆడటం ఒక లెక్కకాదని ఎద్దేవా చేశారు.

2. చెక్ డ్యామ్ ఘటనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం

పెద్దపల్లి చెక్ డ్యామ్ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవిసోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిన ఘటనపై ఆయన ఆరా తీశారు. కూలిపోయిన చెక్ డ్యామ్ లపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

3. విమర్శలపై స్పందన

Advertisement

ఏపీ ప్రభుత్వ ఎంఓయూలు నకిలీవన్న కేసీఆర్ విమర్శలపై మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ హయాంలో ఎంఓయూలు కేవలం కాగితాలకే పరిమితమై ఉండొచ్చని, కానీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలవుతోందని స్పష్టం చేశారు.

4. ఎమ్మెల్యే ఫైర్

కొత్తగూడెం జిల్లా విద్యానగర్ పంచాయితీ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఆలస్యంగా రావడంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. సమయపాలన లేని అధికారులు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని నిలదీస్తూ, ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.

5. అబద్ధాలు నిజం కావు

Advertisement

నీళ్లు-నిజాలపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా.. బీఆర్ఎస్ నేతలు పాత మాటలే చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో యూరియా కోసం రైతులు పడ్డ కష్టాలు అందరికీ తెలుసని.. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని మండిపడ్డారు.

6. వామపక్షాల నిరసన

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీ రామ్ జీ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. MGNREGA ఉపాధి హామీ పథకం పేరు మార్చడం, నిధుల్లో 30 శాతం కోత విధించి రాష్ట్రాలపై భారం మోపడాన్ని సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.

7. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేపింది. రాయదుర్గంలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో.. డ్రగ్స్ విక్రయిస్తున్న 5గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్స్, 7గ్రాముల OG గంజాయి స్వాధీనం చేసుకున్నారు. SOT పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

8. ఎమ్మెల్యే ఆందోళన

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి వందలాది మంది యువత తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అంబర్‌పేట ఎస్సై భానుప్రకాష్ బెట్టింగ్ అప్పుల కోసం తన గన్నునే అమ్ముకోవడం, సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంపై స్పందించారు.

9. ప్రచారాలు నమ్మెుద్దు

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను అసోసియేట్ డీన్ గోవర్ధన్ ఖండించారు. ఫుడ్ పాయిజన్ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

10. 2029లో పోటీ చేయడం ఖాయం.. కవిత

2029 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత. అయితే పార్టీ పేరు జాగృతి ఉంటుందా లేక మరొకటి ఉంటుందా అని చెప్పలేనన్నారు. గతంలో సొంత పార్టీయే కుట్ర చేసి తనను ఎంపీగా ఓడించిందని కవిత ఆరోపించారు.

11. అభివృద్ధి పనులు

తుళ్లూరు నుంచి వడ్డమాను రోడ్డును రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ప్రభుత్వం.. త్వరలో రూ. 900 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు రైతులు సహకరిస్తున్నారని, ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

12. దర్యాప్తు ముమ్మరం

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగోప్పలలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల మధ్య ఉన్న పాత గొడవలు లేదా రాజకీయ కోణంలో ఈ దాడులు జరిగాయా అనే కోణంలో సీఐ శ్రీనివాసరావు విచారణ జరుపుతున్నారు.

13. రాయచోటి వద్దు.. కడపే ముద్దు

కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలో చేర్చిన ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలంటూ రెండు మండలాల ప్రజలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన ప్రజలు రాయచోటి వద్దు కడపే ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.

14. బాధితుల ఆందోళన

కడప జిల్లా పోరుమామిళ్ల రెవిన్యూ తహసీల్దారు, ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. భూ సమస్యల పరిష్కారంలో అక్రమ మ్యుటేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

15. నిబంధనలు ఉల్లంఘించలేదు

ఏలూరు జిల్లాలోని మాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్‌పై జరిగిన పోలీసు దాడి రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ క్లబ్ నిర్వాహకుడు కాట్రగడ్డ అశోక్ సంచలన వివరణ ఇచ్చారు. తాము ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, అనుమతి ఉన్న స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నామని స్పష్టం చేశారు.

16. వేగంగా చర్యలు

అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ చర్చలపై టెలిగ్రామ్‌ యాప్‌లో స్పందించారు. చర్చలు వేగంగా సాగుతున్నాయని.. అమెరికాతో కలిసి తమ బృందం పని చేస్తోందని తెలిపారు.

17. భారీగా హిమపాతం

హిమాచల్‌ ప్రదేశ్‌లో హిమపాతం మొదలైంది. ఎత్తయిన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నీటి ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జల వనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచు పొరలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

18. రైల్వే ఛార్జీల పెంపు

ఈనెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సబర్బన్, నెలవారీ సీజన్‌ టికెట్లు, 215 కిలోమీటర్లలోపు సాధారణ క్లాస్‌ను మినహాయిస్తూ.. దూర ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

19. తొలి బ్యాటర్‌గా స్మృతి

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది. మహిళల్లో సుజీ బేట్స్‌ తర్వాత ఈ క్లబ్బులో అడుగు పెట్టిన క్రికెటర్‌ స్మృతినే.

20. పరువు నిలబెడతాడు

శంబాల సినిమాతో కుమారుడు ఆది తన పరువు నిలబెడతాడని సాయికుమార్‌ అన్నారు. ఆది హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం శంబాల. యుగంధర్‌ ముని తెరకెక్కించారు. డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×