Christmas Box Office:వాలకం చూస్తుంటే ఈ ఏడు క్రిస్మస్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే కనిపించబోతోంది. అవును ..ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు క్రిస్మస్ రేసులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి మరి. ముఖ్యంగా ఈసారి తెలుగు ఆడియన్స్ కి మాత్రం థియేటర్లలో ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.
ముందుగా మన తెలుగు సినిమాల విషయానికి వస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాలు క్రిస్మస్ సందర్భంగా ఒకే తేదీన విడుదల అవబోతున్నాయనే టాక్ వినిపిస్తుంది.
దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.ఇక బాలయ్య సినిమా అంటే మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఇక నాగార్జున సినిమా అంటే స్టైలిష్ లుక్, సరి కొత్త స్టోరీస్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడన్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేరోజు వస్తే థియేటర్ల దగ్గర జోష్ మామూలుగా ఉండదని ఇప్పటి నుండే హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు మూవీ లవర్స్.
అయితే ఇప్పటి వరకు బాలయ్య, నాగార్జున సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ అనుకుంటే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా కూడా ఈ రేసులోకి వచ్చేస్తున్నాడట .అవును . బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కూడా క్రిస్మస్ సీజన్‌లోనే రిలీజ్ కాబోతుందని సమాచారం . సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి కూడా.. షారుఖ్ ఖాన్ గతంలో నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కొల్లగొట్టడంతో ‘కింగ్’పై సాలిడ్ బజ్ పెరిగిపోయింది.
ఇక షారుఖ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాలి .ఒకవేళ తెలుగు వెర్షన్ కూడా క్రిస్మస్ సమయంలో విడుదలైతే మాత్రం బాలయ్య, నాగార్జున సినిమాలకు గట్టి పోటీ ఉంటుంది అనడం లో సందేహం లేదు.
బాలయ్య అభిమానులు తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తుంటే.. నాగ్ అభిమానులు కూడా ‘కింగ్ 100’పై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆయన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతాయా అని క్యూరియాసిటీ తో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్ .
మొత్తానికి ఈసారి క్రిస్మస్ సీజన్‌లో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోందన్న మాట . బాలయ్య, నాగార్జున, షారుఖ్ ఖాన్ సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలోకి వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర అసలు మజా మొదలైనట్టే. మరి చివరకు ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద అసలైన కింగ్ గా నిలుస్తుందో చూడాలి.
also read:సురేఖ వాణి పర్సనల్ వీడియోలపై వివాదం.. స్పందించిన నటి!