Motorola New Gadgets: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో పాటు రెండు వేరబుల్స్‌ను ప్రపంచ మార్కెట్‌లో ప్రకటించింది. Moto Watch 2 Fit పేరుతో ఫిట్‌నెస్ వాచ్‌ను, Moto Buds 2 Ultra పేరుతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. వాచ్‌కు పోలార్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ సపోర్ట్ ఉండగా.. ఇయర్‌బడ్స్ సౌండ్‌ను బోస్ ట్యూన్ చేసింది. ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలనుకునేవారితో పాటు మంచి ఆడియో కోరుకునే వారికి ఇవి ఉపయోగపడొచ్చు. ఈ రెండు గాడ్జెట్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moto Watch 2 Fit ప్రారంభ ధర రూ.12,000. Moto Buds 2 Ultra ధర రూ.21,000 నుంచి మొదలవుతుంది. రాబోయే వారాల్లో యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్‌లోని ఎంపిక చేసిన దేశాల్లో ఇవి అమ్మకానికి రానున్నాయి. భారత్‌లో విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వాచ్‌కు ట్రేసింగ్ గ్రే, ఎలిగెన్స్ కేస్ రంగులు,స్ట్రాటిఫైడ్ సీ, పిజన్, బాలెరీనా స్ట్రాప్‌లు ఉన్నాయి. ఇయర్‌బడ్స్ టెంపుల్ గ్రే, రిఫ్లెక్టింగ్ పాండ్ రంగుల్లో వస్తాయి.
Also Read: మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!
Moto Watch 2 Fitలో 1.85 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 390 x 450 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. అల్యూమినియం కేస్‌తో వచ్చిన దీనికి IP68 రేటింగ్ ఇచ్చారు. ఇందులో Wear OSకు బదులుగా RTOS ఉంది. అందువల్ల థర్డ్‌పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఫిట్‌నెస్ వివరాల కోసం పోలార్ సపోర్ట్ ఉంటుంది. 400mAh బ్యాటరీ Always-On Display ఆన్‌లో ఉంటే ఏడు రోజులు, ఆఫ్ చేస్తే 12 రోజులు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. తక్కువ పవర్ మోడ్‌లో 16 రోజుల బ్యాకప్ వస్తుంది. పది నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజు వాడుకోవచ్చు. వాచ్ బరువు 28.1 గ్రాములు.
Moto Buds 2 Ultraలో 11mm డైనమిక్ డ్రైవర్‌తో పాటు Knowles ఆర్మేచర్ ఉంది. బోస్ సౌండ్ ట్యూనింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ దీని ప్రత్యేకతలు. బయట శబ్దాన్ని తగ్గించేందుకు ANC ఉపయోగపడుతుంది. LHDC 4, LHDC 5 హై-రిజల్యూషన్ ఆడియో కోడెక్‌లతో పాటు SBC, AACకు సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బడ్స్ 8 గంటలు పనిచేస్తాయి. కేస్‌తో కలిపి మొత్తం బ్యాకప్ 37 గంటల వరకు ఉంటుందని మోటరోలా తెలిపింది.
ఇయర్‌బడ్స్ కేస్‌కు Qi 2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బడ్స్, కేస్‌కు IP57 రేటింగ్ ఇచ్చారు. ఇది దుమ్ము, నీటి ప్రభావం నుంచి రక్షణ అందిస్తుంది. అయినా వాటిని నీటిలో ముంచకూడదు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, పోలార్ ట్రాకింగ్ కోరుకునేవారికి వాచ్ నచ్చొచ్చు. బోస్ ట్యూనింగ్, ANC, వైర్‌లెస్ ఛార్జింగ్ కావాలనుకునేవారికి Buds 2 Ultra ఆసక్తికరంగా ఉండొచ్చు. భారత్‌లో ధర, విడుదల తేదీపై స్పష్టత వచ్చాక వీటి విలువపై ఓ అంచనాకు రావచ్చు.
Also Read: రూ.200 లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్.. Jio, Airtel, Vi వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఏది బెటర్ అంటే?