RC17 Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే పెద్ది మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆయనతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మూవీ హీరోయిన్ గురించి టాలీవుడ్ లో చర్చ జరిగింది.. ఇప్పుడు సినిమా బడ్జెట్ పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ బడ్జెట్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రీసెంట్ గా రాంచరణ్ నటించిన పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు సుకుమార్తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కొట్టేసిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని ఫాన్స్ కూడా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు దాదాపూగా 450 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
రామ్ చరణ్ తన 17వ చిత్రాన్ని సుకుమార్తో చేస్తున్న విషయం తెలిసిందే.. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రంగస్థలం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రాబోతున్న సినిమాపై అంచనాలు కూడా కాస్త పెరుగుతున్నాయి.. ఇటీవల కాలంలో రాంచరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని వార్తలు మాత్రం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో రాముడు కృష్ణుడు పాత్రలు కనిపించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే పలు పోస్టర్లు కూడా బయటకు రావడం గమనార్హం.. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది అని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలతో పాటుగా షూటింగ్ అప్డేట్ కూడా రాబోతుంది అని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హెడ్ కొట్టిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..